పుట:Thimmarusumantri.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

తిమ్మరుసు మంత్రి


యమూల్యం బగు గారుత్మతరత్నహారంబు కవి కంఠంబు నలంకరించినఁ బ్రహృష్టుఁడై ................ దీవించెదన్

మత్తారాతియయాతినాగమసుతున్ మంత్రీశ్వరుం దిమ్మరు౯"." అని పూరించి,

"కం. అయ్య యనిపించికొంటివి
     నెయ్యంబునఁ గృష్ణరాయనృపపుఁగపుచే
     నయ్యా నీసరి యేరీ
     తియ్యనివిలుఁకాఁడవయ్య : తిమ్మరుసయ్యా: "

అని శ్లాఘించి నఁట! ఆంధ్రకవులం గూర్చిన కధ లిట్టి వనేకములు గలవు. ఆకథ లన్నియు నాయాకవుల చరిత్రమునఁ గాని కృష్ణరాయని చరిత్రమునఁ గాని యుదాహరింపఁ దగినవై యున్నవిగావున నిట వివరింపలేదు.


__________