పుట:Thimmarusumantri.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమప్రకరణము

దక్షిణ దిగ్విజయము

శ్రీవీరనరసింహదేవరాయని పరిపాలనముననే శ్రీకృష్ణదేవరాయఁడు కర్ణాటదేశమునంతయు జయించి శ్రీరంగపట్టణమున చిక్కదేవరాయని ప్రతినిధిపాలకునిగా నియమించి జయధ్వజ మెత్తించి విజయోత్సాహముతో రాజధానిఁ బ్రవేశించెనని మున్నె తెలిపి యున్నాఁడను. ఇతఁడు పట్టాభిషిక్తుఁడైన వెనుక తిమ్మరుసుమంత్రి ద్రావిడదేశమును జయించి కప్పయిలు సరిగా నిర్ణయించి రాఁబట్టి తెచ్చుటకై విజయప్పనాయకుని, కృష్ణప్పనాయకుని, వేంకప్పనాయకుని మువ్వురను నియమించెను. విజయప్పనాయకుఁడు లక్షసైన్యముతో బయలువెడలి వేలూరు ప్రాంతదేశమును వశపఱచుకొని వేలూరు ముఖ్యస్థానముగ నేర్పఱచుకొని రాయనికై కప్పములు గైకొనుచుండెను. అట్లు చిత్తూరు, తొండమండలము, తంజపూరు, తిరుచనాపల్లి, మధుర, తిరునగరు, కొడగు, మళయాళము మొదలగుదేశముల రాజులెల్లరును రాయనికి వశ్యులై కప్పములను జెల్లించిరి, ఈ దక్షిణదేశమునంతయును మూఁడు ఖండములనుగా విభజించి మూవురు ప్రతినిధిపరిపాలకులక్రింద నుంచెను. జింజీలో నివసించెడి కృష్ణప్పనాయకుఁడు నెల్లూరు మెదలు కొల్లడము నదివఱకును గలదేశమునకు, విజయరాఘవ నాయకుఁడు కావేరినది