రేచక, పూరక, కుంభక,
సూచకముల రాజ - యోగి సుస్థిర మతియై,
లో చూపు జూడనొ' ల్లక,
వాచా బ్రహ్మంబు పలుక వద్దుర వేమా. 200
పడి పడి మ్రొక్కగనే' టికి,
గుడి - లోపల కఠిన శిలల గుణములు చెడునా?
గుడి దేహమా' త్మ దేవుడు,
చెడు - రాళ్లకు వట్టి పూజ సేతురు వేమా! 201
పలుగు రాళ్ల దెచ్చి, పరగ గుడుల గట్టి,
చెలగి శిలల సేవ జేయనే' ల?
శిలల సేవ జేయ, ఫలమే'మి గల్గురా? వి. 202
200. Be not like those haughty monks who imagine that by the gestures appointed for respiration, inspiration and retention of the breath, they have attained to wisdom. In the absence of inward vision boast not of mere oral divinity
201. Why bow and fall down in worship? will the hard stone in the temple change its nature? The true temple is the body, the soul is the god therein; empty is the worship ye pay to these worthless stone.
202. Why collect slabs of marble, build temples with them, and delight to worship stones? What profit have you of adoring a stone?