పుట:The Verses Of Vemana (1911).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           పికము వనము లోన విలసిల్ల బలికిన -
           భంగి, ప్రాజ్ఞ - జనుల పలుకు గులుకు;
           కాకి కూత బోలు, కర్మ - బంధుల కూత. వి. 91

           చిక్కి యున్న వేళ సింహంబునైనను,
           బక్కకుక్క సేరి , బాధ సేయు;
           బలిమి లేని వేళ, పంతంబు సెల్లదు; వి. 92

           జ్ఞానులమ'ని యెంచి చపలా' త్ముల' గు వారు,
           తెలివి లేక, తమ్ము దెలియ లేరు,
           కష్ట గహనమందు కాడ్పడి యున్నారు. వి. 93

           పాప పుణ్యములను పసి - గాపె' రుంగునా?
           ధరను పరమ యోగి యెరుగు గాక;
           లోని పొందికె గని లోహముల్ గూర్పరో? వి. 94

91. Sweet as the cuckoo warbling in a garden are the charming words of the wise; but the words of sinners are vile as the cawing of a crow.

92. When even a lion is emaciated, even a starved dog can torment him; when we are powerless all our undertakings are vain.

93. Fickle fools imagine themselves wise, void of understanding they know not themselves; they are bewildered as in a thick forest.

94. What does a heredsman know of vice and virtue? The perfect sage alone can discriminate them. How can metals be welded unless we know their nature?