Jump to content

పుట:Tenugutota.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనుగుతోట


గీతాసఖి

వ్రాలు స్వచ్ఛంద గగనతోరణము క్రింద
కాంతి రేణుపుంజములు జగాన గురియ
లసదభిజ్ఞాన తరువులు పసరు వోయ
సహృదయానంద కళ్యాణ విహృతికొఱకు
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము !

లేఖనీ సర్వతోముఖ శాఖ లంది
ప్రేమపల్లవ స్ఫురదభిరామ వగుచు
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

ఇసుకపొరలు చీల్చుచు పొంగు లెసగ బొరలు
పొడుపుటేళ్ళు త్రుళ్ళింత లాడెడు విధాన
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

పైటజాఱ సి గ్గెఱుగని పల్లెపడుచు
కోయిలకు మాఱు కూసెడి గొల్లపిల్ల
అణగి తులసికి మ్రొక్కు బ్రాహ్మణ కుమారి
బ్రమసి వల పెత్తి యాలింప పచ్చి ఫణితి
పాడవమ్మ గీతాసఖీ ! భావపదము.

7