పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

7


గెను. ఆబాలురందఱిని గూర్చుండ నియమించి, నరసరాయలు 'బాలురారా ! మీలో తెలివిగల వారెవరో లేచి నిలువఁబడుఁడు' అనెను. అందఱును ఒకరిమొగము లొకరు చూచుకొనుచు నూరకుండిరి . రామకృష్ణుఁడు లేచి నిలువబడెను. నరసరాయ లిట్లు ప్రశ్నించెను --- 'అబ్బాయీ! అందఱును మారుమాటాడక కూర్చుండియుండగా నీవేల లేచి నిలువఁబడితివి?'

రామకృష్ణుడు ధైర్యముగా 'అయ్యా! ఎవరు తెలివిగలవారో లేచి నిలువబడుడు అనికదా ప్రశ్నించిరి. అందఱును దెలివిహీనుల వలె గూర్చుండిరి. ప్రతివారికిని గొంచెమోగొప్పగనో తెలివి యుండి తీరునుగాని యుండకపోదు. ఈబాలులందరును దమ తెలివి గుర్తింప నేరని మూఢులుగాన మాటాడక యూరకున్నారు. నేను తెలివిగల వాడనను ధైర్యము నాకు గలదు గాన నిలువబడితిని' అని పలికెను.

నరసరాయలు విస్మయపరిచేతస్కుఁడై , యాతడు వృద్దిలోనికి రాగలడని తలంచి ఓయీ! నీకేదైన జిన్నయుద్యోగ మిప్పింతును. నాతో వత్తువా?' యని ప్రశ్నింప నాత డంగీకరించి తలిదండ్రులతో కలిసి యాతని ననుసరించి చనెను. తెనాలికి సమీపముననున్న బట్టుపల్లె యనుగ్రామములోని బట్రాజుల సాంగత్యముచేసి రామకృష్ణుడు కవిత చెప్పుటయందు బ్రావీణ్యము సంపాదించెను. రామకృష్ణు డల్లసాని పెద్దనయను కవీంద్రుని దర్శించి, యాతడు సంతసించున ట్లీక్రింది పద్యము రచించి చదివెను-

క. నలుగురు నినుఁ బలుమారున్
   గెలుతురు సుగుణోక్తికి కాంతికీర్త్యాకృతులన్
   నలుగురు నినుఁ బలుమారున్
   భళిభళియన కచ్చరంగపాండురరంగా!