పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

'అ సంశయమేమి?' అని దేవి ప్రశ్నింప, రామకృష్ణుడు తల్లీ! మాకు పడిశము బట్టినచో రెండుచేతులతోను బాధపడుచున్నను జాలుబలేదే సహస్రశీర్షములుగల నీకు పడిశము పట్టినచో నెట్లు బాధపడుదెవోయని నవ్వుపచ్చినది. అని బదులుచెప్పెను. అతని పరిహాసమునకు బ్రమాదంబంది 'దేవి 'రామకృష్ణకవీ! నీవు వికటకవివై ధనయశస్సముపార్జన మొనరింతువు' అని యంతర్ధానమయ్యెను.

కాళికాదేవి యొకగిన్నెలో క్షీరమును, మరియొకగిన్నెలో బెరుగును బోపి, 'దీనిలోనీకేది కావలయు?'నని ప్రశ్నింపగా నాతడు అమ్మా! ఆ పాత్రలను నీ చేతిలో యుంచుకొనియడిగినచో నేనేమిచెప్పుదును? అని వానినందుకొని 'ఇదియేమి?' అని ప్రశ్నింపగా, 'దేవి ఇది విద్య, ఇది ధనము, ఈరెండింటిలో నీకేమి కావలయునో తీసుకొను' మనెను. రామకృష్ణుడు 'అమ్మాఁ విద్యయుండి ధనములేని మనుజులకు మర్యాదయుండదు. దారిద్ర్యానలమున మ్రగ్గిపోవుచు నెవడును గ్రంథములరచించి విద్యావ్యాప్తికి తోడ్పడజాలడు. కావున విద్యాధనములు రెండును మానవున శవసరమే' యని పాలును పెరుగును కూడ త్రాగివైచెను.

అతని సాహసమున కచ్చెరువంది. దేవి 'రామకృష్ణా! నీకవిత్వము శాశ్వతమై ఆచంద్రతారార్కమై వెలయుగాక ' యని నీవించి మాయమయ్యెనని కొందరు చెప్పుదురు.


3 ఆస్థానమున బ్రవేశించుట

విద్యానగరమున కేలికయైన సాళువనరసరాయలు దేశసంచార మొనరించుచు తెనాలినొకసారి చూడబోయి యచ్చట పాఠశాలకరి