పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

నాఁటగోలె పెద్దనకవీశ్వరుఁడు రామకృష్ణునివిషయమై రాయలతోఁ జెప్పి యాస్థానకవిగా బరిగణింప వలసినదాని కోరెనని చెప్పుదురు. కొందఱు నందితిమ్మనకవీంద్రు నుద్దేశించి రామకృష్ణుడు.

క. 'నీకవితామాధుర్యం
    బేకవులకు గలుగ నేర్చు నే కూపనట
    ద్బేకములకు నాకధునీ
    శీకరములచెమ్మ ! నందిసింగయతిమ్మా'

యని చదివెనట. అంత నా నందితిమ్మన్న కవీంద్రుడు పరమానందభరితాత్ముండై తనకు శ్రీకృష్ణ దేవరాయలు బహుమానముగ నొసంగిన శాలువ నిచ్చెను. ఆశాలువ ధరించి, రామకృష్ణు డాస్థానమునకుఁ బోయెను, రాయలు రామకృష్ణుడు ధరించియున్న శాలువా చూచి ‘కవిచంద్రమా! నీ కియ్యది యెట్లు లభించినది?” అని ప్రశ్ని౧పగా తన పద్యమునకు సంతోషించి, నందితిమ్మన్న యా పచ్చడము నొసంగెనని చెప్పి యాపద్యము జదివెను, రాయలు సంతసించి రామకృష్ణుని సన్మానించెనట,

4 ధూర్జటి కవి

ఆస్థానకవులందరిలో కృష్ణదేవరాయలకు ధూర్జటికవిపై నత్యధికమగు ప్రీతిఁగలిగియుండెను. కవితాగోష్ఠి సలుపునపుడు రాయలు తఱచుగా ధూర్జటి కవిత్వమును గూర్చియే ప్రశంసించు చుండెను. ధూర్జటి పైకి పరమశ్రోత్రియుడుగా గన్పట్టుచు రహస్యముగా వారాంగనాలోలుఁడై మెలగుచుండెను. అట్టి మహాకవి యవినీతివర్తను డై మెలగుచు భార్యమోము చూడకుండుటచే నెట్లయిన యాతని వేశ్యానురక్తి తొలగజేయవలయునని పెద్దనాదులందరు నిశ్చయించుకొని, రామకృష్ణకవితో 'ఇది నీవల్ల జరుగవలసిన పనిగాని మావలన