పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


తే. బర్హ మణిబంధ మా వేల్పుపచ్చ నెదురు
    గ్రచ్చకాయలతిత్తియు గంబుశ క్తి
    గలిగి విహరించు బౌండరీకంబునందు
    నందులేబట్టి ప్రాలేయ నగముపట్టి.

సీ. నగధ్వని వాహనంబగు గోవృషముఱంకె
                లనమెల్చు ఘంటామహాక్వణములు
    హరశిరశ్శశిరేఖ యపరావతారంబు
                లనబొల్చు సేవాగతాబ్జముఖులు
    కాద్రవేయాకల్ప కంఠ మూలచ్చాయ
                లనబొల్చు నగరు ధూపాయతంబు
    లీసానభూషణా హిన్పటా మణికాంతు
                లనబొల్చు రత్నదీపాంకురములు

తే. ఖండపరశుతనుప్రభా ఖండదుగ
    జలధిక లసీకరములన బొలుచువేల్పు
    టేలికలుచల్లుపూవుదోయిళ్ళుగల్లు
    సగము మునిముఖునకు దృగానందమొసగె

సీ. చలిదిచిక్క పుజిల్లు సాలుముల్ కాసుపై
                 నొయ్యారముగ పింఛ మొయ్య జెరివి
    భాస్కరాంశులు దూఱి పానువ్రేల్వీనుల
                 వేలలేని మకరకుండలములునిచి
    మోచేతివంపుగా ముడిచిబట్టిన కేల
                 వరదాభయంబు నాపటముజేసి
    పొలలేనియరటుల నిరసించుమ్ళదులొరు
                యమళమధ్యమున గోయష్టినిలిపి