పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

67


తే. నిగమనూపురములు మ్రోయ నిరుకుళముగ
     సిగ్గువాసినకటి ప్రకాశింపనురము
     కెంపులేయెడఁ గ్రక్కఁ జెక్కిళనగవు
     మొలవ నత్తీర్ధముననిల్చిపొల్చు చక్రి,

సీ. కలదు లేదను వాదములకోర్చి మీనుమీ
                 సమువంటి యొంటిజంగము మెఱవఁగ
    లహుసంకుమదపంక పొణింధమంబై న
                 తాళిగోణపుఁబెంగు నేలజీరఁ
    గదలేని వీడ్యంపుఁ గప్పుచుందురు కావి
                 మోవివల్లొత్తుల ముసుఁగుదన్న
    సానతాఁకులుగల్గు సూనాస్తుశంఖంబు
                గతి నఖరేఖాంక గళము దనర

తే. సఖులు పరిహాసకులు వెంటజనగ యువతి
    భుక్త నిర్ముత్త పరిధాన యుక్తుడగుచు
    నగరుగంటాపదంబున నగుచుదిరుగు
    నొఱపుగలఠీవి జాతిమాత్రోవజీవి.

సీ. పరమేష్టినుండి నీతరముదాక కశుద్ధ
                 తరమయినవంశంబు దలచవైతి
     దఱిద్రొక్కియున్న యీతల్లిదండ్రుల జాల
                 పఱచవై సంతోష పఱచవైతి
     నగ్ని సాక్షిగ బెండ్లియాడిన యిల్లాలి
                 నిల్లాలితాకార నొల్లవైతి
     ధర్మశాస్త్రార్ధవిత్తముల విత్తములచే
                 నలరించి విఖ్యాతి నందవైతి