పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[9]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

65


తే. సౌగతాగమమాలిమి శాస్త్రసరణి
    వల్లువల్గన చిత్రధావనము గల్గు
    నిన్నుఁ దరిచేసి, భవద్యార్థిని స్తరించి
    దరిఁ దఱియకున్నఁ గలదె మోదము మురారి.

సీ. కుఱుచలై గుమురులై గొనబులై లేఁబాప
               కొమ్ముజుట్టినజడల్ గుమురుకొనగ
    మెఱపుల మిట్టలై మిక్కిలి బటువులై
               గ్రాలుకన్నుల చెన్ను గబ్బుదేర
    జిక్క నై చెలువమైన చిన్నదియై యొప్పు
               మోము దంష్ట్రాటంకముల దలిర్ప
    నీలమై నిబిడమై నింగి కిం
               దుగనున్న బలుమేని పొగరమెఱయ

తే. బ్రతిపతి కేతనుని పురః క్షేత్రమూది
    యున్న శ్రీక్షేత్రపాలకు యోగిలోక
    రమణుముప్పది రెండక్షరముల మంత్ర
    రాజను జపించికొల్వ దొరకుశుభములు.

సీ. నిడువాలుగను చూపు నిగిడిన చో నెల్ల
                బీరెండ రేయెండ బెండ్లియాడి
    నిశ్శ్వాసపవనంబు నెనరుచో నెల్ల
                బ్రామిన్కు నెత్తావు లాముకవియఁ
    బొక్కిటితమ్మిపు ప్పొడియొల్కు చోనెల్ల
                బ్రహ్మాంకురంబులు పాదుకొనఁగ
    నడుగు లేజిగురాకు లంటినచో నెల్ల
               వివిదతీర్థశ్రేణి వెలివొడవ