పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


లీయఁబోవ నీవందరకును వాతలిడు టేమి?' అనగా రామకృష్ణుఁడు 'మహారాజా! నేను చెప్పునది సావధానచిత్తులరై యాలకింపుడు. మాతల్లి వాతరోగపీడితయై చనిపోవుచు వాతలు, వాతలు అని కలవరించుచు మృతినొందెను. ఆమె ఆత్మసంతృప్తికై యింతమంది బ్రాహ్మణులు మఱల నొకచోట కలియరని యెంచి, యాఫలము నాకు దక్కుటకై వాతల బెట్టించితిని' అని వాక్రుచ్చెను.

తాతాచార్యుల సలహా ననుసరించి, తానొనరింపఁ బూనిన దకృత్యమని బోధింపఁజేయుటకై రామకృష్ణుడు పన్నిన పన్నుగడ యని గ్రహించి రాయ లా దానమును జేయుటమానెను.


30 చిన్నా దేవి

రాయలు భార్యలందఱిలో జిన్నా దేవియెడ నత్యంతానురాగ యుక్తుడై యుండును. చిన్నా దేవి నందఱివలెగాక ప్రత్యేకానురాగముతో జూచునని యెల్లరకును దెలియును. రామకృష్ణునితో గూడ రాయలు చాలసార్లు 'కవిచంద్రమా ! ఇందఱు సతులలో నాకొక్క చిన్నా దేవియెడలనే యంత యనురాగమేల యుండవలయును? నిజముగా నిది పూర్వజన్మ ఋణానుబంధమైయుండు ననెడివాడు. రామకృష్ణు డొకటిరెండుసార్లట్లు విని 'రాజేంద్రా ! నాకొకసందేహము భయము కలుగుచున్నది. 'అతి సర్వత్రవర్జయేత్తను సూత్రానుసారము, అధికానురాగము, అపరిమితప్రేమ తుదకు వైరముగాఁ బరిణమించుట సహజము'అనెను. రాయలు 'వెఱ్ఱివాడా! చిన్నాదేవియెడ నాకీజీవితములో భేదాభిప్రాయ మెన్నడును కలుగదు అనెను.

కొన్నాళ్ళకు రాయ లొకనాడు చిన్నాదేవితో గలిసి సౌధము పైయంతస్తున గూర్చుండి మలయమారుత సౌఖ్యము ననుభవించుచు నేవోకొన్ని ప్రశ్నలడిగెను, చిన్నాదేవి తన పుట్టినింటివారిం గూర్చి