పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

51


యేదో యాలోచించుకొనుచుండుటచే నాప్రశ్నలకు సమాధానము బలుకదాయెను. 'ఏమాపరధ్యాన' మని రాయలు హెచ్చరింపగా నామె పక్కున పెద్దగానవ్వెను. రాయల కానవ్వు సంతసము కల్గించుటకు మాఱస్యహము కలిగించెను. కోపోద్దీపితు డయ్యును రాయలామె నేమియు ననక యటనుండి వెడలిపోయెను. దినములు, వారములు, మాసములు గడచెను. రాయలు చిన్నాదేవి యతఃపురమున కరుగడాయెను.

చిన్నా దేవి దయార్ద్రహృదయఁయగుట నందఱిగౌరవమునకుఁ బాత్రురాలాయెను. ఆకారణమున రాయ లిట్లకారణముగ నామెతో మాట్లాడుట మానెనని వినిన వారందఱును వర్ణనాతీతమగు ఖేదము నొందిరి. రామకృష్ణునకు జిన్నా దేవియెడలగల గౌరవమునకు బరిమితిలేదు. ఆతఁ డామె యంతఃపురమునకుఁబోయి, జరిగినదంతయు దెలిసికొని 'అమ్మా! రాయలు నీయెడ ప్రసన్నుడగుటకు చక్కని యుపాయముం బన్నెదను. కొలది దినములు వేచియుండు' మని ధైర్యము చెప్పి రాయలుకడ కరిగి 'మహా ప్రభూ! నాకు జిరకాలమునుండి కాశీ రామేశ్వరయాత్రల జేసి రావలయునని యున్నది. మఱల నొక మాసములో వత్తు'నని పలికి, కొంతధనము దీసికొనెను. అతడు వారణాసికిఁ బోవక రహస్యముగా నింటనేయుండి బంగారముతో వడ్లగింజల జేయించి, యొకనాడు అర్ధ రాత్రివేళ నూరి వెలుపలనున్న సత్రములోనికేగి, తెల్లవారినపిదప తాను వారణాసినుండి తిరిగివచ్చితినని కబురంపెను. రాయలు మంగళతూర్యారావములు భోరుకలంగ, రామకృష్ణకవి నూరేగించి, తన సౌధములోనికి గొనిపోయి 'రామకృష్ణకవీ ! విశేషములేమి?' యని పశ్నింప నాతఁడు మహారాజా! కాశీలో సదానందసాధువను గొప్పసన్యాసి నాశ్రయించి, బంగారు వడ్లగింజల గొనివచ్చినాను. బంగారపు ధాన్యము పండును' అనెను,