పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

టీ. కనన్ = చూడగా, నీహార= హిమమువలె, గు=తేజరిల్లుచున్న , పద్మపత్ర = తామరపత్రములవలె, ధళ = తెల్లనై న, రంగత్=ఒప్పుచున్న, కీర్తి=ప్రశస్తిగలవాడా, చాణూరమత్=చాణూరుఁడను వానిని, హద=వధించినవాడా, శుక్రాక్షికళ=తెల్లనైన నేత్రములు గల కాళిందుఁడను, ఇభరాట్ = గజరాజునకు, మృగపతీ=సింహాసమానుఁడా, త్త్రెలోక్య=మూఁడులోకముల, ధామ=నివాసస్థానమైన , ఉదరా=ఉదరముగలవాడా, శంకర=శంకరునియొక్క, పాదపద్మయుగ, దివ్యాస్తోకపాణే= పాదపద్మముల భజించు, శరములతో=నొప్పువాడా, అనగా=అనిచెప్పగా, జన=జనులయొక్క, అర్ధ=కోర్కెల, నవ=క్రొత్తవైన, హి=హితముల, ప్రద=ఒసగువాడా, వైరి=శత్రువుల, విగ్రహ=పొందినను, ముకుందా=పోగొట్టువాడా, అధిపా=ఓప్రభూ, మిత్ = మృత్యు దేవతను, రవింధా=ఆజ్ఞాపింపుము.

తా. ఓ కృష్ణా! నిన్ను భక్తియుక్తులై గొల్చువారి హితాభిలాషివై , మృత్యువును దూరమొనరింతువు, అనఁగా దీర్ఘాయుష్మంతులుగాఁ జేయుదువు,

నీ కీ మహార్థ ప్రతిపాదకమైన పద్యము రుచింపక పోయెనా?

చ. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాస్థలంబునన్
    బలుకగరాకునోరి, పలుమారుఁబిశాచపుపొడగట్ట నీ
    పలికిననోట దుమ్ముపడ భావ్యమెఱుంగక పెద్దలైన వా
    రల నిరసింతురా! నినుమురా! నరసా విరసా! తుసా! భుసా.

చ. ఒకనికవిత్వ మందెనయు నొప్పులుతప్పులు; నాకవిత్వమం
    దొకనికితప్పు! బట్టపనియుండదు! కాదనితప్పుబట్టినన్
    మొగమటు క్రిందుగాదిగిచి మొక్కలువాసిన యంపకత్తితో
    సిక మొదలంటఁగోతు మఱిచెప్పునగొట్టుదు మోముదన్నుదున్.

నరసరాజు సిగ్గుపడి, మాఱుమాటాడకు0డ వెడలిపోయెను, కొలఁదిదినములు గతించినపిదప రాయలు తన తనూజయగు తిరమ