పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

23


లాంబతోఁ జదరంగ మాడుచుండగా, బంటు రెం డేనుఁగులమధ్య నిఱుకుకొంటఁజూచిఁ తిరుమలాంబ 'యుద్ధతుల మధ్యమునఁ బేదరుండ దరిమె, యని బంటులు పైకి ద్రోసెను. గాయలు 'నీకీ పద్యపాద మెటనుండి లభించినదని యడుగఁగాఁ దిరుమలాంబ 'నేనీపద్యమును నాలుగు దీనారములిచ్చి కొంటిని' అని, యిట్లు చదివెను.

'గీ. ఒత్తుకొనివచ్చు కటికుచోద్యృత్తి చూచి
    తరుణి తనుమధ్య మెచటికో తెలఁగిపోయె
    నుండెనేనియు : గపడకున్నె యహహ
    యుద్ధతులమధ్యమునఁ బేదకుండ దరమె'

'అయ్యో | ఆపద్యమునకు నాలుగు దీనారములు వెలయా? నూఱుదీనారము లిమ్ము' అనగా తిరుమలాంబ నరసరాజునకుఁ గబురంపి నూఱుదీనారము లొసంగి గారవించెను, 'తాను వ్రాసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానమను ద్వ్యర్థికావ్యమును వినవలసినదని రాయల నాతఁడు కోరఁగా, విని హరిశ్చంద్రనలోపాఖ్యాన మనరాదనియు నల హరిశ్చంద్రోపాఖ్యాన మని యుండవలయు ననియుఁ జెప్పి, యనేక రీతుల సత్కరించి, వీడ్కొలిపెను.

నరసరాజుని యుపాయమున కందఱు సంతోషభరిత హృదయాంతరులైరి.

కవితాప్రసక్తి

శ్రీకృష్ణదేవరాయలొకనాఁడు సభాస్థలి గూర్చుండి, కవులెల్లరును వినునట్లు రామకృష్ణుని జూచి 'కవివరేణ్యా ! పెద్దన కవీంద్ర విరచితమైన మనుచరిత్రమున తిమ్మన్నకవి రచించిన పారిజాతాపహరణమున రామరాజభూషణుని వసుచరిత్రమున నొకేసందర్భమున వ్రాయఁబడునట్లుండు నీ క్రింది పద్యములోని కవితామాధుర్యమును గ్రోలి నీయభిప్రాయముఁ దెలియఁ జేయవలయును.