పుట:Telugunaduanuand00srirsher.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
మిన్నఁగా నున్నగా మెఱుఁగారదువ్వి
       మేలుగా వీలుగా మెలచినకొప్పు
చిన్నారి పొన్నారి, చెమరెత్తుచున్న
       సిరిగుల్కు నెఱిఁదళ్కు, చెక్కుటద్దములు
వన్నెతో చిన్నెతో వరుని మెప్పించు
       వాసిగా దాసిగా వైష్ణవయువతి.

సారణిమిటుఁ గిన్నెరలసాటిగ సన్ననిగొంతులెత్తి శృం
గారముమీర రాగములు గాసరిగాఁ బెరుమాళ్ళసన్నిధి౯
హారతులిచ్చువేళల యొయారము వైష్ణవపమ్మ నారలం
గారల దేసుమీ మధురగానము తమ్మిళిపేశి దోడ్పడ౯.

చ. కలదుసుమీ యొకింతయుపకార మనాథలపట్ల మేటితెం
గళికుడివడ్హ లం దదియుఁ గానముస్మార్తులతోటిపాటెయెం
దులకిటులంటిరంచు మదిఁదోచెడి మీకును శంకదీర్చెద౯
నెలనెలకు౯ వితంతువుల నెత్తులు మంగలిముట్టకుండుట౯,

చ.“ఎడపక సానియిల్మఱిగి యిల్లఁనడద్దిర" యంచుఁ దండ్రియ
ప్పడతుక యింటఁగన్మోరగి బాలకుఁజూడఁ బిపాస దానిపా
నడబయికెత్తి లోనిమిడి పాలునుగూడును సాపడంగ "నా
బుడుతఁడు పైప్లవంబునిలు వున్సరిగా" ననిమెచ్చి వానికై
పడుల గణింపకేగెనట వైష్ణవుడొక్కఁడు తొల్లివింటిరే.

శైవులు


సీ. భస్మత్రిపుండ్రముల్ ఫౌలదేశంబున
                నడినెత్తిమెడమీఁద గడతలందు
కనుఁగ్రేవలను వీపు ననుబుజంబులయందు
       మ్రోచేతులందు రొమ్మునను బొజ్జ
మణిబంధములఁ గటిమండలంబున వ్రేళ్లఁ
       (బ్రక్కలమోకాళ్ళఁబిక్కలందు
సీలమండలనుఁ బాదాలపై యడుగుల
        వ్రేళ్ల మొదళ్ళను గోళ్ళయందు

గీ. నిచ్చటచ్చటనన రాక నెల్ల యెడల
తనువు నిండగఁ దెగఁబూసి తమ్ముఁజూచి
యదరిపడి బ్రహ్మరాక్షసుల్ బెదరిపోర
శైవభూసురు లాంధ్రదేశమునఁగలరు.

సీ. తలయు గడ్డము మీస ములు గోళ్లుఁ జింకలు
                దండిగాఁ బెంచిగొం దరుజరింత్రు
మణిగెడురుద్రాక్షమాలికల్ మెడయందుఁ
       దలయందుఁదాల్చి కొందరుజరింత్రు
పులివెంబడించినప్పుడు గూడ భువినీడ
       దరియరాదనుచు గొందరుజరింత్రు.
ఎట్టియాపదనైనఁ బట్టినట్టి వ్రతంబు
       దప్పరాదనుచుఁ గొందరుజరింత్రు