పుట:Telugunaduanuand00srirsher.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
పుళిహోరసాద మాకలిదీఱుటకెగాని
       యేకాదశినిఁ దిండి హేయమండ్రు
ఆత్మసంస్తుతు లవి యాచారమేకాని
       దురభిమానము చాల దూష్యమండ్రు

గి. ఘనపటాటోపమెల్ల లౌక్యంబెగాని
దంభసంరంభములు సేయఁ దగదటండ్రు
చెట్టలకుఁ గొంతయుపపత్తి జెప్పుచుండ్రు
వైష్ణవాచార్యస్వామ్యయ్యవార్లుగారు.

ఉ. చుంగులు వారధోవతులు సొంపుగఁగట్టిన యుత్తరీయముల్
కంగులుదీర న౦సములు గ్రమ్ముకవేలఁగఁ జల్ది సాదముల్
ఠంగునఁగొట్టి కోవెలకొ ఠాయులఁ గొందఱుమంది వైష్ణవుల్
పొంగళిబుట్ట లెత్తికొని పోవుదు రిండ్లకు వీధివింబడి౯.

చ. తెలియదునాకుఁ బూర్ణ ముగధీరులు వైష్ణవు లేమి సేతురో,
చలనముగాన రాదు, తెఱచాటునఁ జేతు; రదేమిటంటిమా
తళియయటండ్రు; కొంచెను నిదానముగానొకయింతవింటిమా
గళుకుగళుక్కు మన్గటుకు గట్కు గుటుక్కు గుటుక్కు గుట్కమన్

శా. బారుంబూరుగనారగింతురువడప్పణ్నేరముల్ పూర్ణప
ణ్నీరంబుల్పుళిహోర తైరువడపన్నేరంబు దధ్యోదనం
బారంగర్యమధుల్కొళంబువురితో హ్యాతై రుమోరున్మహో
దార స్వైరవిహార వైభవులుదాత్త ప్రాభవుల్ వైష్ణవుల్.

ఉ. కాకరకాయ కట్టొకటి • కైనిడిపోయెడికాపు జూచి “చీ
యేకడఁగజ్జికాయ లివియేల” నన౯ విని “మంచికూరఁయోఁ
గాకర కాయలం" డనుచుగాపువచింపఁగ"నట్లనా, యువుం
గాకిటుజూపు"మన్న విని కావుసమర్పణ సేయఁగా దిరు
ప్పాకముజేసి సాపడెను వైష్ణవులొక్కరు తొల్లి మెల్లన౯,

ఉ. వైష్ణవునామముల్ గనిన బాబొకడోర్వకనాక వానిక్రో
ధోష్ణమునార్పనాతడొకయు క్తినిఁబన్నె తురుష్క భూమిరా
డ్జిష్ణుతకంచు నాభిపరి షిక్తము దిద్దుట గాన కాతఁడా
యుష్ణక రాత్మజాలయము నొయ్యనబోయెనటండ్రు గ్రక్కున౯.

చ. చెఱువున కేగెడు౯ జలము చెంబును బూనడు, లేశమాత్రము
న్మఱుఁగుజరూరు లేదు, తను మానవులెవ్వరు జూచిన౯ సరే
వెఱువడు, బాహ్యగామియగు వేళను; సాపడునప్పుడొప్పుగ
న్దెఱమఱుఁగడ్డముండకను తీరదు వైష్ణవభూసురాళికి౯.

చ. దిటముగలోనగోచియిడి తెల్లనిధోవతీ గూడుకట్టుగాఁ
బటుగతిఁగట్టి జుట్టుముడి బల్హోయలై వెనుపట్టెమూయఁగా
స్ఫుటమ: గనూర్థ్వపుండ్రముల శోభిలదవ్వుల నవ్వుకొంచుని
వ్వటముగఁగన్ను లార్చుచును వైష్ణవమాణవకుండువచ్చెడి౯.

ఉ. పూచినతంగెడుల్ కఱిఁగిపోసిన బొమ్మలు నిల్చిధాత్రి పైఁ
దోచిన క్రొమ్మెఱుంగులమితో జ్జ్వల రాజకిరీటకోటిపై
దాచినపద్మరాగములు దర్ప కుదార లసత్పటంబుపై
వై చినచిత్రరేఖ లలవైష్ణవవసుందరు లేమిచెప్పుదున్.

తరువోజ, తిన్నని సన్ననితిరుచూర్ణ రేఖ
        తీరుగా సౌరుగా దిద్దిన మోము