పుట:Telugunaduanuand00srirsher.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
గీ. బ్రాహ్మణులతోడిపొత్తును భక్తిమీది
వలపు నీరెండునెన్నఁడు . దలవునందు
మఱువగారాదటంచుఁ గొందరుజరింత్రు
శైవభూసురులాంధ్ర దేశంబునఁదు.

సీ.పంచాక్షరీమంత్ర పఠనగోప్య మెకాని
              యధ్యయనంబు లంతంతమాత్ర
మాగమోక్తంబుల నాచరించుటెకాని
      వేదోక్త మదియొక్క వీసముండు
నట్టిల్లునిండగాఁ బట్టుపెట్టుటెకాని
      కర్మధర్మములెవ్వి కానరావు
తుదకు నూరైన వత్తులు గాల్చుటేకానీ
      యౌపాసనములు మాటాడరాదు.

గీ. ధనము వెచ్చించి రాత్రిభోజనములిడుచు
జనులు గొనియాడగా గణార్చనలెకాని
యజ్ఞయాగాదికముల పేరైన వినరు
శైవు లేమందు నాంధ్రదేశంబునందు.

చ. పరశివునం దమందదృఢభక్తి, యవారతనిందిత క్రియా తా
చరణమున న్విరక్తి, మధు సారములొల్కుమృదూక్తిదేవ
ధ్వరకరణాగమప్రచుర తంత్రవిశంకటశక్తి, తుందగ
స్వార పరిపూర్ణభుక్తి, యహహా యివి శైవులనై జసంపదల్.

చ. మనుదివముల్ ప్రసాదనియ మంబునునిత్యమహేశ్వరార్చనం
బును నిరతంబు బిల్వదళ పూజసదాధృత భవ్యలింగలాం
ఛనమును సర్వదా పటుపిశాచవితాన విపాటనక్రియా
చణమగుభూతిధారణను శైవులుమాన్యులుగారె ధారుణి౯

ఉ. కట్టలుకట్టలే కరుచుగావలెఁ బత్తిరి, మ్రుగ్గుపిండులా
బుట్టలుబుట్ట లేతరిగి పోవలె, మెత్తనిదూదివత్తులా
తుట్టెలుతుట్టెలే చమురుతో వెలుగన్వలె, నౌప్రసాదమా
తట్టలుతట్ట లే కొసలు దట్టగ, విస్తరినిండ గావలె౯
పట్టులు పట్టులౌర యయవారులకు న్శివపూజువేళల౯.

సీ. నూరువత్తులవారు పేరుజెందనివారు
               వేయివత్తులవారు విడియుచోట
వేయివత్తులవారు వెనుకఁబట్టిన వారు
      లక్ష వత్తుల వారు డాయుచోట
లక్షవత్తులవారు లావుదూలినవారు
      కోటివత్తులవారు గూడుచోట
కోటివత్తులవారుకొరకుమాలిన వారు
      భూరివత్తులవారు జేరుచోట

గీ. విత్తమున కే ముదాత్తవి ద్వత్త కేమి
చిత్తసత్తలకేమి ధీమత్త కేమి
వత్తులే బత్తులకును మహత్తులెన్న
దేవసములైన శైవభూదేవులందు.

ఉ. కాయము భూతిభూషితము కర్మము తీక్ష్ణముదుర్గమంబు న
త్యాయతినంతరంగ గుణమద్భుతమైనశీల గరుంగగాఁ
జేయుజగత్తమంబు పసజించు మహామహిమంబు భానులె
క్కాయను గంటిరే నివురు గప్పిననిప్పులు శైవభూసురుల్