పుట:Telugu merugulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

81


సాతవాహనసప్తశతిలో మాఘమాసే, గవామివ అన్న పదవిభాగమున కనుగుణ మనందగినది గాథ యొకటి కలదు.

"విక్కిణిఇ మాహమాస - మ్మిపామరో పాఇడం వఇల్లేణ
శోద్ధూమ మమ్మురవ్వి ఆ - సామలియథణో పడిచ్ఛన్తో",

దీనికి శ్రీసాథుని తెలిఁగింపు :

>"మాఘమాసంబు పులివలె మలయుచుండఁ
బచ్చడం బమ్ముకోన్నాఁడు పణములకును (వసరమునకు)
ముదితచన్నులు పొగలేని ముర్మురములు
చలికి నొఱగోయ కేలుండు సైరికుండు". (క్రీడాభిరామము

ఇందు మాఘమాసమున గోవులు తక్కువ ధరలకును, పచ్చడములు హెచ్చుధరలకు నమ్మకమునకు వచ్చుట చెప్పఁబడినది. మాఘమాసమున గోవులధరలు పడిపోవుట చలికాలమున వారికి వ్యాధ్యాది బాధ లుండుటచేఁ గాఁబోలును. భారతకాలమునుండి రెండువేలేండ్ల క్రిందటినాఁటి దాఁక మాఘమాసము నేఁటి ధనుర్మాసమువలె శైత్యాధిక్యము గలది గాఁబోలును, -3- అట్టశూలా జనపదాః

పురాణములలో కలికాలవర్జనఘట్టమున నీ శ్లోకముండును.
“అట్టశూలా జనపదా శివశూలా శ్చతుష్పథాః,
ప్రమదాః కేశశూలీన్యో భవిష్యంతి కలౌ యుగే"

ఈ శ్లోకమున కర్ణ మెఱుఁగరాదు. 'అట్టశూలంబుల యగును దేశములెల్ల' అన్న రీతిని దేలిఁగింపవలసినదే. నేఁటి కైదువందల యేండ్ల ప్రాంత కాలమునాటి దగు ప్రసంగరత్నావళిలో నీ పురాణ శ్లోకమున కీ క్రింది నిఘంటువునుబట్టి యర్ధము చెప్పఁబడినది.