పుట:Telugu merugulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

తెలుఁగుమెఱుంగులు


“అట్ట మన్న మితీ ప్రోక్తం, బ్రాహ్మణశ్చ చతుష్పడు,
కేశో యోని, శ్శివో వేదః, శూలో విక్రయ ఉచ్యతే'.

4.రఘుకులాన్వయ రత్నదీపం

"శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపమ్
ఆజానుబాహు మరవీందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి".


ఈ శ్లోకము నిట్లే యూపామరపండితము పఠింతురు 'రఘుకులా న్వయ రత్నదీపం' అనుట కర్ధము పొసఁగదు. ఈ క్రింది వింతనిఘంటువు పొసంగించుచు,

“అన్వయస్తు సముద్రస్స్యాత్ -రత్నదీపశ్చ చంద్రమః",


4.వానవా

“గ్రంథగ్రంథిం తదా చక్రే ముని రూఢం కుతూహలాత్
యస్మిన్ ప్రతిజ్ఞయా ప్రాహ ముని ద్వైపాయన స్వీదమ్.
అష్టా శ్లోకసహస్రాణి హ్యాష్టా శ్లోకశతానిచ,
అహం వేడ్మి శుభ వేత్తి, సంజయో వేత్తి వానవా,
తశ్లోకకూట మద్యాపీ గ్రథితం సుదృఢం మునే
భేత్తుం నశక్యతే ఒరస్య గూఢత్వాతశితస్యచ "

భా. ఆ. అనుక్రమణికాధ్యాయము.

'సంజయో వేత్తి వానవా' యనుచోట సరసార్ధ సంధాయకముగా నొక వింతనిఘంటువు గలదు. “వానవా దీర్ఘదర్నీ స్యాత్ ” అని - యది.