పుట:Telugu merugulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

83


అక్రీతదాసః

"యస్య సౌతి మతం మనీషిసదసి శ్రీనీలకంఠధ్వరీ
కొండాజ్యోతిషికశ్చ యస్య కురుతే సమ్మాన పూర్యై స్సమమ్
యత్రానుగ్రహ దృష్టి మర్పయతి చ శ్రీ బాలకృష్ణో గురుః
స్కో యం దీవ్యతి చొక్కనాథమఖినా మకీదాసః కవిః".


“ఆక్రీతదాసో జామాతే" అని వింతనిఘంటువు. రామభద్ర దీక్షితుఁడు చొక్కనాథమఖికి అల్లుఁడే. కాని యీ నిఘంటు వెక్కడిదో?

వల్మీకః


"వల్మీకాగా త్రభవతి ధనుఃఖండ మాఖండలస్య” అన్న మేఘసందేశ వాక్యమున కర్ధము కుదుర్పనుగాఁబోలుసు "వల్మీక స్సాతపో మేఘః" (ఎండతోడి మబ్బు వల్మీక మనఁబడును) అన్న నిఘంటువుముక్క నెవ్వరో పుట్టించిరి. వ్యాఖ్యాతలు గొంద ఱీనిఘంటువు సుదాహరించిరి. కాని యది యే నిఘంటువులోని దనిరో నా కెఱుకపడలేదు. పుట్టమీది నుండి యింధ్రనువు కొనవచ్చు ననుటకు బృహత్సంహితాప్రమాణమును, దదనుగుణముగా "పుట్టవెడలి నభోభిత్తిఁ బుట్టుశక్రకార్ముకపుఁ బెద్ద పలువన్నె కట్టజెజ్” అన్న యాముక్తమూల్యదాప్రయోగమును శ్రీ వేంకటరాయ శాస్త్రిగారు మేఘసందేశాంధ్రవివరణమునఁ బ్రకటించిరి. “వల్మీక స్సాతపో మేఘః" అన్న నిఘంటువు నెవ్వఁడో యెఱుక చాలనివాఁడు సృష్టించినాఁ కనవచ్చును.