పుట:Telugu merugulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

తెలుఁగుమెఱుంగులు


గంధర్వనగరమ్ రామాయణమునను, కాదంబర్యాదిగ్రంధములందును 'గంధర్మ నగర'మను పదము మిధ్యార్ధమున, అనఁగా చూపట్టియుఁ జూచుచుండఁ గనె మాయ మగునది యన్నయర్థసందర్భమునఁ బ్రయోగింపఁబడినది ఆకసమున నగరాకారముగా గోచరించుమేఘచిత్రములను గంధర్వ నగరము లనుట ప్రసిద్ధము. బృహత్సంహితాది జ్యోతిష గ్రంధములందు పానీస్వరూపవర్ణనము విపులముగాఁ గాననగును ఈ విషయము నెఱుఁగకో యేమో ప్రాచీనులే యెవ్వరో “గంధర్వ స్స్వప్న ఈరితు" అని నిఘంటువును గ్రంధస్థీకరించి రని శ్రీరామకృష్ణ కప్ గారు వెల్లడించిరి ఈ నిఘంటువునుబట్టి గంధర్వనగర మనఁగా 'గలలోఁ గానవచ్చిన పట్టణము' అని యర్ధమగును.

-9- జీర్ణారణ్యం

ఉత్తరరామచరిత్రమున

“చిరం ధ్యాత్వా ధ్యాత్వ నిహిత ఇవ నిర్మాయ పురతః
ప్రవాసే చాశ్వాసం నఖలు నకరోతి ప్రియజసః
జగ జీర్ణారణ్యం భవతిచ కళత్రవ్యుపరమే
కుకూలానాం రాశౌ తదసుహృదయం పచ్యత ఇవ" (6–35)


అన్న శ్లోకమున 'జీర్ణారణ్య' పదమునకు 'పొడువాటినయడవి అని యర్థము సంగతమగుచున్నను, సారస్య విశేషాధాయక మని కాబోలుసు వ్యాఖ్యాతలు “జీర్ణారణ్యం శ్మశానం స్యాత్" అని నిఘంటువు నుదాహరించిరి. ఈ నిఘంటు వెక్కడిదో !