పుట:Telugu merugulu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

85


శమీపత్రం

“శమీపత్రప్రమాణేన పిండం దద్యా ధయాశీరే,
ఉద్దరే తృప్త గోత్రాణి కుల మేకోత్తరం శతమ్".


ప్రత్యాబ్దికశ్రాద్ధ ప్రయోగమున పిండ ప్రదానకాలమున గయపిండ దానప్రశంసాపరముగ నీశ్లోకమును వైదికులు పఠింతురు. ఇక్కడ జమ్మియాకంతమాత్రము (అనఁగా నొక యన్నపుమెదుకుఅగును) గయాశిరమునఁ బిండప్రదానము చేసిన నది సప్త గోత్రములను, నేకోత్తర శతకులమును నుద్ధరించును అని యర్ధము పొసంగుచునే యున్నను, పలో కొందబు “శమీపత్రంతు కందుకమ్” అనియు, “శమీపత్రం కుక్కుటాండమ్” అనియు శమీపత్రపదమునకు బంతియని, కోడిగ్రుడ్డని అర్ధము వచ్చునట్లు నిఘంటువులఁ జెప్పుచున్నారు. కాని పాల్కురికి సోమనాథుఁడు.


“ఆకాంక్ష శ్రీగిరియం దొక్క జమ్మి
యాకు పట్టెడునంత యన్న మొక్కనికి
దానంబు సేయు నుద్యత్పలంబునకు
మానుగా నవియ సమానంబు లనఁగ",


(పండితాధ్య చరిత్ర, పర్వత ప్రకరణము) అని 'శమీపత్రప్రమాణ' పదమునకు 'జమ్మియాకంత' అన్నయర్థమే ప్రాచీన విద్వత్సమ్మత మగుట గ్రంథసపటీచినాఁడు.