పుట:Telugu merugulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

తెలుఁగుమెఱుంగులు


ప్రసన్న వదనం


 "శుక్లాంబిరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే. "


ఈ శ్లోకమును వైష్ణవులు విష్ణుస్తుతిగాఁ బఠింతుఁరట! దాని కిందు 'విష్ణుమ్' విశేష్య మగుట సాధకమే కాని, 'శశివర్ణమ్' 'శుక్లాంబరధరమ్' అన్నవిశేషణములు బాధకము లగును. స్మార్తులు విఘ్నేశ్వరపూజలో బ్రప్రథమముననె విఘ్నేశ్వరవాచకము విశేష్యము దుర్ఘట మయినది. ఈ బాధ తొలఁగుటకే యేమో యీ క్రింది నిఘంటువు పుట్టినది; "ప్రసన్నో మత్తవారణ!" 'ప్రసన్న' మనఁగా మదపుటేనుఁగు. 'ప్రసన్నవదనుఁ' డనఁగా 'మదగజాననుఁడు.' విఘ్నేశ్వరవాచక మయిన విశేష పదము పయిని ఘంటువుచే ఘటిల్లినది. జైను లీశ్లోకమును శ్వేతాంబరజీన దేవతాస్తుతిపర మందురంట. ఇట్లు నానా దేవతాస్తుతి పరముగా నీ శ్లోకము విఱుగుచుండుటను గమనించి కొంటె విద్వాంసుఁ డొకఁడు దీనికి గార్దభ స్తుతిపరముగా సర్థము చెప్పినాఁడు. - 12 - సుందరకాండ రామాయణమున నైదవకాండమునకు సుందరకాండ మని పే రగుటకు పలువురు పలుతీరుల నర్ధములు చెప్పుచున్నారు. ఆ యర్థములకు నిఘంటువులఁ జెప్పుచున్నారు. “ సుందరో హనుమాన్ స్మృతః" అనియు, “సుందరం త్వంగుళీయకమ్" అనియు ఆ నిఘంటువులు. హనుమంతునికి సంబంధించిన కథార్థము గలదిగాన, మటి యంగుళీయకప్రదాన