పుట:Telugu merugulu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

87


కథాప్రధాన మయినదిగాన "సుందరకాండ' మని పే రయ్యెనని పై నిఘంటువు అర్ధము గుదుర్చును.

- 13 . మదిరాక్షి

మదిరాక్షి, మదిరాయతలోచన ఇత్యాది విధముల సంస్కృతాంధ్ర ములలో స్త్రీ వర్ణన ముండును. దీనికి 'మద్యపానము చేయుటచే నెఱవారిన కనులవంటి కనులుగలది' అని కొంద అర్థము చెప్పదురు. 'మదిరో మత్తఖంజనః' అని ఒక నిఘంటువు సుదాహరించి, మదిరశబ్దమునకుఁ బొగ రెక్కిన కాటుకపిట్ట యనియు, దానీవంటి కనులు గలదిగాన మదిరాక్షి యయ్యె ననియు పలువు రర్ధము చెప్పుదురు. 'మదిరో మత్త భంజనః! ఎక్కడిదో తెలియదు. కొన్ని వ్యాఖ్యాన గ్రంథములలోఁగూడ నిది గలదు. ఇటీవల ఉద్యానపత్రికాధిపతులు శ్రీ తాతాచార్యులుగారు శృంగార దృష్టులలో నొక దృష్టివిశేషమునకు 'మదీర' మని పే రుండుటను నాట్యశాస్త్రమునుండి యుద్ధరించి చూపిరి. కాన 'మదిరో మత్తఖంజనః అన్నది అప్రౌఢకల్పితనిఘంటు వగుట వ్యక్త మయినది.