పుట:Telugu merugulu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

గ్రంథ గ్రంథులు

ఆంధ్ర గ్రంథములందు ముడులువిడని గ్రంధ గ్రంధులుగాఁ గొన్ని పద్యములు, పదములు గానవచ్చుచున్నవి. అట్టి వానిలోఁ గొన్నింటి కిక్కడనా చేతనయినంతలలోఁ జిక్కులు ఏడఁదీయఁ బ్రయత్నము చేయుచున్నాఁడను.

-1-

చందమామఘుటిక

"పాత్రసంశుద్ధి కాజ్యం టుపస్తరించి
యూరకుండిరి యిది యేమి యొక్క వీరు?
కానరా విష్ణు శాకపాకములు నెదుర
మనకు నిజమయ్యె నల చందమామఘుటిక, "

(భీమఖండము.)


కాశిలో వారముదినములనుండి తిండిలేక త్రిప్పులఁ బడుచున్న వ్యాసాది మహర్షు లొక పెద్దముత్తయిదువ యన్న ప్రదానము చేయుదు ననఁగా ననుష్ఠానములు దీర్చుకొని కూర్చుండిరి, విస్తళ్లు వేసిరి; పాత్రాభిఘారముచేసిరి. అంతే! వడ్డనగాని, యింట వంటవాసనగాని కానరాదయ్యెను. అప్పుడు వ్యాసాదు లనుకొన్న ట్టున్నచొప్పు పయిపద్యము ఇందు “మనకు నిజమయ్యె నల చందమామఘుటిక” అన్నపాదమున కర్దము కావలెను.


“తూప్లీం స్థితాః కి మేతన్ను నాణ న్నాదిక మవేక్ష్యతే:
సత్యాం భూ దధునా స్మాకం శశాంకఘుటికాకధా. "


అని పయి తెలుఁగుపద్యమునకు సంస్కృతశ్లోకము. నా కీట్లు తోఁచినది: ఉడుగక మారాముపట్టి యేడ్చుచున్నపసిబాలురను పెద్దవా