పుట:Telugu merugulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

89


రెత్తుకొని, వెన్నెలలోని కరిగి కనువిందు గొలుపుచందమామను జూపుచు “చందమామ రావే జాబిల్లి రావే.... వెండిగిన్నెలో వెన్న పెట్టుకుని, పమిడి గిన్నెలో పాలు పోసుకొని, ఒలిచిన పండు చేతఁ బట్టుకొని, ఒలవనిపండు ఒడిలో ఉంచుకొని రావే చందమామా, అబ్బాయీ నీవూ ఆరగింతురు కానీ' అని పాటపాడుచు చందమామ తన కేదో తినుబండారములు తెచ్చిపెట్టు నని బాలకు లూఱడిల్లియుండునట్లు మోసగింతురు. ఇదీ శశాంకఘుటికొకథ. సంస్కృత భీమఖండమునను, తెల్గు భీమఖండమునను. 'శశాంకఘుటిక-చందమామఘుటిక ఉన్నదిగాని, ఈ నానుడి విష్ణువురాణమున మడొక్క మాడ్కిగా నున్నది.


"ఆందని పంటి కేమిటికి నట్టు నిగిడ్చెడు విష్ణుం డన్నయా
కందున, చందమామగుటకల్. విను మీపని కట్టి పెట్టు

( 2 అశ్వా)


ఇక్కడకూడ 'ఘటికల్' అని మార్చవచ్చును గాని అచ్చులో 'గుటకల్' అని యే కలదు. ఈ పాఠమునకు, చందమామ యేమో తెచ్చి పెట్టఁగలఁ డని నోరూరఁగా బాలకులు గుటకలు మ్రింగుచుఁ జూచుచుండు టర్థమగును. భీమఖండపు 'ఘుటిక' కంటే నీ 'గుటక' సారస్యముగలది. కాని సంస్కృతపు 'ఘుటిక' కు 'గుటక' తెలిఁ గింపుగాదుగదా!

ఈ 'చందమామగుటక' మాదిరిగా 'చందమామ గ్రుక్కిళ్లు' అని ప్రయోగాంతరము గలదు.


"ఎలమి సుముహూర్తముసఁ డెరయెత్త సంతం
బ్రేషు చుడి మీఁగాఁ జందమామచెలుల
కెంపుమోవుల సుధకు గ్రుక్కిళ్ళు మ్రింగ
క్షితి గలిగెఁ జంధమామ గ్రుక్కిళ్లు నాఁడు."

(తారాశశాంకము)