పుట:Telugu merugulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

తెలుఁగుమెఱుంగులు


నాచన సోమనాథుని “యాలజాలంబు నీరిలో నాడు జాడ" యన్న ప్రయోగముకంటె స్పష్టముగాఁ బై తాళ్ల పాకవారిపదములు 'ఆలజాల' మనఁగా 'మీనపద' మన్న యర్ధమును సమర్ధించుచున్నవి.

మాఘమాసే గహమీవ

"అర్జునస్య ఇమేబాణా
నేమే బాణా శిఖండిన,
కృష్ణని మమ గాత్రాణి మాఘమాసే గవామివ"

మహాభారతము భీష్మపర్వమున (17)-64) నీశ్లోక మున్నది, తిక్కన సోమయాజులవారు దీని నీ క్రింది విధమునఁ దెలిఁగించిరి.

"అశనికల్పము లివి యర్జుసుభాణముల్
గాని శిఖండివి గావు సుమ్ము
కర్కటి గర్భంబుకరణి గాత్రము ప్రచ్చె
నిట్టివి వానికి నెందుఁగలవు "

'మాఘమాసే గవా మివ' అన్నదానికి 'కర్కటి గర్భంబు కరణి' తెలుఁగుసేత. ఈ తెలుఁగు సేత కనుగుణముగా నొక వింతనిఘంటువు గలదు. 'మాఘమా కర్కటీప్రోక్తా తదపత్యంతు సేగవా', ఈ నిఘంటు వెక్కడిదో యెఱుఁగరాదు. కాని తిక్కననాఁటికే యిది కలదో, తిక్కన తెలిఁగింపునుబట్టి పుట్టినదో యెఱుఁగరాదు. 'మాఘమాసే గపొయివ' అన్న చరణమునకు సరళరీతిని 'మాఘమాసే' గవామ్, ఇవ అన్న పదవిభాగము తోఁచును. 'మాఘమా' సెగవామ్' అన్నది కుటిలరీతి. మాఘమా-ఆకారాంత స్త్రీలింగము గాఁబోలును. ఈ పైశ్లోకార్థమున కీ నిఘంటువును, నీ నిఘంటువున కీశ్లోకమును నాశ్రయములు.