పుట:Telugu merugulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

79


అన్న యర్థము పొసఁగును.కాదంబరీ ప్రయోగములకు పలవరింత, చీకాకు అన్నరీతి సర్ధము పొసఁగును. తెలుఁగు ప్రయోగమున కీ యర్థములు పొందుపడవు. ఔపచారికముగా నేదో యర్థము పై ప్రయోగముల కనుగుణముగాఁ గుదుర్చుకొనవలెను. కానీ, వృద్ధానుశ్రుతిలో 'ఆలజాలం మీనపదమ్' అని నిఘంటువాక్య మున్నది. ఈ వాక్య మేనిఘంటు లోనిదో యెఱుఁగరాదు. నా చూచినంతవఱకు నేసంస్కృత నిఘంటువునను గానరాలేదు. ఇది నాచనసోమనపద్యమున కైయే పుట్టిన నిఘంటువేమో యనిపించుచున్నది. ఈ నిఘంటువు ప్రకారమునఁ జూడఁగాఁ బద్యమునకుఁ జక్కని యర్ధము పొసఁగును. నీటిలో చేపయడుగు నడచుజాడ, ఆకసమున గాలిపడగ యాడుబ్రోవ ఇత్యాదిగా సుందరమయిన యర్థసంగతి యేర్పడును.

“ఔదుంబరాణి పుష్పాణి, శ్వేతః కాకశ్చ దృశ్యతే,
మత్స్యపాదో జలే దృశ్యః, నారీచిత్తం న దృశ్యతే".

అని శ్లోక మొకటిగూడ ఆలజాలమునకు మీన పదార్ధమును

బలపడుచునది గలదు, మఱియు
"తటతట నన్నీటిమీఁద నాలజాలంబు
సీటునటుల జరియించ యీఁదీయీంది
అటువలెనే పో తమకమందిన సంసారపు
ఘటనకై తిరిగితిమి కడ గానలేక,
"ఆలపోళువానితోడ నంటిన మేనివాఁడు
ఆలగాపరుల తోడ నాడినవాఁడు
ఆలజూలమై సన్నీల నలరఁ దేలినవాఁడు
ఆలపోతుకొండమీద ననువైనవాఁడు".

(తాళ్ళపాకవారి పదములు),