పుట:Telugu merugulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

వింత నిఘంటువులు

ఆలజాలము

"ఆలజాలంబు నీరిలో నాడుజాడ
గాలిపడగ యాకసమునఁ గ్రాలుత్రోవ
నిదురలోపలఁ గలదోచు నీడవిధము
గానవచ్చునె యప్పుడ కన్నఁ గాక! "


"కలలోఁ గన్న పురుషుని, నా చూచినప్పుడు గుర్తింపవలసినదే కాని పిదప మరలఁ గాననగునా” యని యుషతోఁ జిత్రరేఖ యను సందర్భమున, ఉత్తరహరివంశమునఁ బంచమాశ్వాసమునఁ బైపద్యమున్నది. ఇందు 'ఆలజాలము' అన్న పదమున కర్ధము గావలెను. ఈ పదము తెలుఁగున నా కన్యత్ర కానరాలేదు. సంస్కృతమునఁ గాదంబరిలో రెండు చోట్లఁ గాన వచ్చినది.

(1) “యేషాం చ క్షుద్రాణాం ప్రజ్ఞా పరాభిసంధానాయ న జ్ఞానాయ శ్రుత మాలజాలాయ".

(2) ఇత్యేతాని చాన్యాని చాలజాలాని దుర్జీవితగృహీతా చిన్తయన్తీ జాగ్రత్యేవా ౽ తిష్ఠమ్".

ఇందు తొలివాక్యమున 'ఆలబాల' పదమునకు ముద్రిత వ్యాఖ్యలో టీకలేదు. రెండవ వాక్యమున "ఆలజాలాని = స్వప్నాం తర్గత ప్రాగణి" అని యర్థమున్నది. సంస్కృతమున నింక నితరత్ర నా కీపదము గానరాలేదు.

కన్నడమున పంపభారతమున 'బాణజాలమదుభోంక నెనోడువు డాళజాల మాయైనె కడిదొట్టి' {12-68) అని యున్నది. పై కర్ణాటక ప్రయోగమున, ఆలజాలపదమునకు ఛిన్నభిన్నమయినది. మాయమయినది