పుట:Telugu merugulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

77

సున్నలుగా లిపిలో మార్పుచెందుచున్న కాలము. సున్న లుంచుట యింకనుఁ బ్రబలముగాలేదు. 'స్తుతుణు' అనియున్న విధమునఁ గాక, తర్వాత 'అనఘుండు' అని 'జ్ఞు' కు బదులు 'ండు' ఉన్నది. నేను మీఁదఁ బేర్కొన్న విధమునఁ దెలుఁగునఁ గల యరసున్నలు ప్రాయికముగా సంయుక్త హల్ లోపమువలన నేర్పడినవిగాఁ గుదురుచున్నవి. అరసున్నలు గల శబ్దముల నిఁక నీ విధమున సమన్వయించి చూచెదను.

ప్రొఫెసరు శేషగిరిశాస్త్రిగారు పూర్వము అర్ధానుస్వారమునుగూర్చి యొక గ్రంథము రచించి ప్రకటించిరి. వెనుక ఎప్పుడో నేను దానిని చూచితిని. ఇటీవల నా కది యెక్కడను గానరాలేదు. దీనిని నేను వ్రాయుటలోఁ బూర్వ మెప్పుడో పనిచేసియుండవచ్చును. కాని వారి గ్రంథమున అర్ధానుస్వారము పుట్టుటకు నే నిప్పుడు చెప్పిన ప్రక్రియ యున్నట్టు లేదు. అక్షరలో పస్థానీయముగా అరసున్న వచ్చె నని వారు వ్రాసియుందు రని స్మరించుచున్నాను. ద్విత్వ శైథిల్యాదికమును వారు గుర్తించియుండరు. 'ఆంధ్ర శబ్దతత్త్వ' మని పోరు ప్రకటించిన వేటొక గ్రంథమున నేఁజూచితిని, అందు వారు కొలఁకులు మొదలగు శబ్దరూపములు 'కళ్' ప్రత్యయము కలయుటచేత నేర్పడిన వని నిరూపించిరి. జహుకాలమునకుఁ బూర్వము వారు కొంత ప్రశస్తపరిశోధనము నెలపి గ్రంథములఁ బ్రకటించిరి. కాని వానిమీఁద నింక నెంతో మంచి పరిశోధనము పెంపొందవలసియున్నది.

  • * *