పుట:Telugu merugulu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

తెలుఁగుమెఱుంగులు

థానమున సున్నలఁ బొంది ఈంగలు, ఊం కొట్టు, ఈఁగలు, ఊఁ కొట్టు, రూపములం. బడసినవి.

కొంత కాలమునకు దీర్ఘముమీఁది సున్న సూఁదిపలుకుట మాసి తేలఁబలుకుటే నిలిచెను. కాలక్రమమున ఈంగలు, ఊంకొట్టు రూపములు పోయి ఈఁగలు, ఊఁకొట్టు రూపములే నేఁటికి మిగిలినవి. లేపటి కాలమున నీఁక నీయరసున్నలుగూడ సంతరింపనున్నవి. నన్నయకుఁ బూర్వకాలమునను, నించుక తర్వాతి కాలముననుగూడ నేఁటి యర్థానుస్వారము అనునాసిక సంయుక్తాక్షరముగా నుంచుటను. నా సంయుక్తాక్షరము పూర్వాక్షరమునకు గురుత్వమును గూర్శక శిధిలముగా నుండుటను బెక్కు శాసనములు నిరూపించుచున్నవి. నన్నయకుఁ బూర్వపు శాసనములలో పండరంగశాసనమందును. యుద్ధమల్ల శాసనమందును నీ తీరును జూడవచ్చును. నన్నయకుఁ దర్వాతి వానిలో దక్షిణ హిందూదేశశాసనసంచయమువాల్యుంలో ననేక పద్యశాసనము లిట్టి తీరులవి గలవు. మాదిరి కోకటి రెండు పద్యములు జూపుచున్నాఁడను. క్రీ. 1065 నాఁటి శాసనము.

గీ. సకలవసుమతీశమకుటలసద్రత్న
కిరణరు చివిరాజిచరణు ణయిన

క్రీ. 1128 వ నాఁటిశాసనము

క. సూరికవిస్తుతు జ్ఞానముండు
చారుచతుర్దాన్వయాబ్దిచంద్రుణ్ణు గుల ని
స్తారకుడ్లు సుజననిధి రిపు
హరణగజరిఫుబుద్ధవమ్మ" (బుద్ధవర్మ) జనించెను.

ఈ పై పద్యమున అనునాసికసంయుక్తహల్లు ఒకచోటననునాసిక స్థానమున సున్నతో నుండుట గాననగును. ఇది యనునాసికములు