పుట:Telugu merugulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

75


విడఁబడి నడుమ నచ్చుగూడినది.కొన్నింట నాసిక్యముగానీ, తొలిహల్లు లోపించి తత్ స్థానమున నాసిక్యహ యేర్పడినది. కర్ణాటక శిథిల ద్విత్వముల కును, దెఁలుగు శిథిలద్వీత్వములకును గొన్నిభేదములు గలవు,

మీదఁ బేర్కొన్న పదములలో వెలఁగలు, ఈగలు, కొలఁకులు, వలఁకులు అనువానిలో నిట్లే అరసున్నలు పుట్టినవి. వెలఁగచెట్టునకు అఱవమున 'వెలమ్' అని పేరు. 'వేలమ్ గళ్' నుండి 'వెలఁగలు' వచ్చెను. ఈఁగలు-ఈ పదములో 'ఈ' ప్రాతిపదికము, కళ్ ప్రత్యయము కలిసి పరిణామములఁబొంది తెలుఁగుఁదనము వచ్చునాఁటికి 'ఈగలు' బహువచన రూపముగాను, ఈఁగ ఏకవచనరూపముగాను నయ్యెను. ఆఅవమున ఈగకుఁ బేరు 'ఈ' అనియే. బహువచనమున నది 'ఈగళ్ అగును. కాని యిందు శిథిలద్విత్వతల్లోపాదిక మేదియు లేదుగదా, 'ఈఁగలు' అని తెలుఁగున నరసున్న యెట్లు వచ్చెను? అని ఆక్షేపము తోఁచును. పరిశీలింపఁగా నిందు శిథిలద్విత్వము కల దని యేర్పడును. మక్షికకు 'ఈ' అను పేరు. అది చేయుధ్వనినిబట్టి వచ్చెను. దాని ధ్వనియగు ఈ కారము అచ్చులలోని దగు తాలుజన్యమయిన 'ఈ' మాత్రమే కాదు. ఈ ఈకారము ప్రధానముగా నాసిక్యముగూడనగును. ఒక రేదేని చెప్పు చున్నప్పుడు వినువారు 'ఊఁకొట్టుట'లో ఊకారముకూడ నిట్లే ఓష్ఠ్యము మాత్రమే కాక నాసిక్యముగూడ నగును. ఈఁగలధ్వనిని, ఊఁ కొట్టుటను నుచ్చరించునప్పుడు ముక్కుతో నుచ్చరింపవలసియుండును. ముక్కు మూసికొని వీని సుచ్చరింపఁ గుదురదు. కావున ఈఁగల ధ్వనిలోని ఈ కారమునకును, ఊఁ కొట్టుటలోని ఊకారమునకును అంతమునఁగల నాసిక్యధ్వని 'గళ్' పరమయినప్పుడు కవర్గానునాసికమగు 'బ్'గా వినవచ్చును. అప్పుడు ఈజ్ గళ్, ఊజ్ కొట్టు పదములు వచ్చును. పూర్వోక్తవిధమున నివి వికల్పముగా శిథిలత్వములై యనునాసిక