పుట:Telugu merugulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

తెలుఁగుమెఱుంగులు


“వినుఁడు సురేశ్వరు వనపాలకులు వార్ధం
బొడమిన యీ దివ్యభూరుహమున
కింద్రాణి యెవ్వతె? యింద్రుండు నెవ్వండు?
తోడి యిందిరను గౌస్తుభము నెవ్వం
డధీపుఁడై ధరియించె నతఁడె చేగౌనుఁగాక
తెకతేర యిది యేమి యొకరీ సొమ్మె ?
ఇదె నాదు విభునిచే నీ వదాన్యనగంబు
నాడియించుకొని యేఁగుచున్నదానం
బలుకు లేటికిఁ దా వీరపల్ని యేని
మీ శచీదేవి తనడు ప్రాణేశుఁడయిన
మఘవు నీటఁ దింపి సత్యభామావిధేయు
వలన మరలంగఁ గొనుట పోవానితనము".

అని సత్యభామ యనును.

ఈ విధముగాఁ బారిజాతాపహరణము నాటకధర్మమెంతో సంతనగా సవరించుకొన్న రుచిరప్రబంధము. ఇందు వాచ్యమయిన యీకథేతివృత్తమేగాక వ్యంగ్యముగా నింకొక కథేతివృత్తముగూడ నున్నది. పాచ్యకథలో శ్రీకృష్ణుఁడే వ్యంగ్యకథలో శ్రీకృష్ణదేవరాయఁడు. రుక్మిణీ సత్యభామలే తిరుమలదేవీచిన్నాదేవులు. కవియే నారదుఁడు. ప్రియుఁడగు కృష్ణరాయని యాదరతారతమ్యముచే సతులలోఁ బొర పేర్పడుట. ఆ పొరపును దీర్చి యానుకూల్యముఁ గల్గించి, నందితిమ్మనకవి శ్రీ కృష్ణరాయని తనచెప్పుచేఁతలకు దిద్దుకొనుటయే పుణ్యకవ్రతవిధానము. ఇట్లే మహాప్రబంధము వాచ్చేతివృత్తమునకుఁ జాటున ధ్వనిగా నింకొక యితివృత్తమును వెలయించుచున్న ధ్వనిప్రధానమైన యుత్తమ కావ్యము. ఇందు మహాకావ్యమున కుండవలసిన ప్రయాణోద్యాన