పుట:Telugu merugulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

71


వనవిహారజలక్రీడాదౌత్య యుద్ధాది వర్ణనలు బలవంతముగాఁ గావ్యత్వసిద్ధికై కల్పించిన వర్ణనలుగాఁ గాక నాటకకథలో సత్యావశ్యకముగా నపేక్షితము లయిన నాటకాంగములుగానే పొసఁగుట గొప్పచమత్కారము! కవి స్వతంత్రుఁడై యీ కథలోఁ దననాఁటి శ్రీకృష్ణదేవరాయల మహారాజ్య వైభవములతో జోడించి వర్ణించినాడు. ఇవి చదువుడు:


"అమరవిభుఁడు దూరమున నంబుజనాభునిఁగాంచి సంభ్రమో
ధమమునఁ జేతియంకుశముఖంబునం గుంభములూఁది కుంచితా
భీమచరణంబున న్మదకరిన్ డిగి యంసవిలంబికల్పచే
లము నడుమ నిగించుచు నిలానిహితాత్మ శిరఃకిరీటుఁడై. "


ఈ పద్యము"ఎదురైనచోఁదన మదకరీంద్రము నిల్పి, కేలూఁత యొసంగి యెక్కించుకొనియె” సన్నట్టు పెద్దనకుఁ, దనకు, నింక నితరకవులకు శ్రీకృష్ణరాయఁడు గజారూఢుడై యేఁగునప్పుడు జరగుచు వచ్చిన సత్కారములనుబట్టి పుట్టినది.


'జలరుహనేత్రుఁగాంచి సరసత్వము మీఱుఁగ నొక్క చేలుపుం
జిలుకలకొల్కి రాచిలుకచేఁ బిలికించిన సత్యభామ కా
కలికి తెఱంగు శౌరి కడకన్నుల సన్నలఁ జూ షేఁ గోపకం
దళకలుషాయితాక్షి వలనంబుల నా సతీ ద న్నదల్పఁగన్. "


ఈ పద్యము శ్రీకృష్ణరాయఁడు గజారూఢుఁడై దేవోత్సవాదులం దూరేఁ గునప్పు డనుభవించిన యనుభవవిశేషములకు జ్ఞాపకముగాఁ బుట్టినది


"కలికి నిడువాలుఁ గన్నుల
తళుకులు మణిదీపశిఖలుఁ దడఁబడ లక్ష్మీ
నిలయున కిచ్చిరి కొందబు
నెలఁతలు మౌక్తిక విచిత్ర నీరాజనముల్."


శ్రీకృష్ణదేవరాయని యంతఃపురానుభవముల కిది జ్ఞాపకము--