పుట:Telugu merugulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

63


దశమశతాబ్దిలో నారంభమయి యిర్వదవ శతాబ్దిలో నేఁడు సాగుచున్న యాంధ్రకవితకుఁ బదునాఱవ శతాబ్ది ప్రథమపాదము సరిగా మధ్యస్థమేకదా ! అది యాంధ్రకవితా దివ్యస్రవంతికి గాంభీర్యము, లోతు చాలఁగాఁగల నట్టనడి యేటిపట్టు! చాళుక్యరాజరాజు, తెలుఁగు చోళరాజు మనుమసిద్ధి, కాకతీయ ప్రతాపరుద్రుఁడు, రెడ్డిరాజ సముచ్చయమునను నాశ్రయాసుక్రమమున సాగివచ్చిన యాంధ్రకవితకు శ్రీకృష్ణరాయని యాశ్రయము పై విధమున ననిదంపూర్వమయిన సభ్యుదయముఁ జేకూర్చిన గట్టి పట్టుగొమ్మ.

ఎడనెడ నన్నయాదుల పురాణరచనలలోను, నన్నిచోడని కుమార సంభవము, ఎఱ్ఱననృసింహషురాణము. మంచనకేయూరబాహు చరిత్రము, దొరకలేదు కానీ తిక్కన విజయసేనము, శ్రీనాథునిశృంగార నైషధము, దుగ్గననాచికేతోపాఖ్యానము మొదలగు కృతులలో రాయలనాటి ప్రబంధరచనావ్యాప్తి యించించుకగా మొలకెత్తినది. శ్రీకృష్ణరాయని కాలమునఁ బర్యాప్త వైభవముతో నిండారి వెలసిన ప్రబంధరచనా సంప్రదాయవాహినికిఁ దత్పూర్వరచన లెట్లెట్లూటకాల్వలయినవో యించుక వివరింతును.

పదునైదవ శతాబ్దిదాఁక నాంధ్రకవితారచన పురాణపరివర్తన ప్రాయమై యున్నది. కాని దానిలోఁ గవికి స్వైరవిహారమును గావింప నవకాశము తక్కువ. సంస్కృతపురాణములు ప్రాయికముగా సల్యార్థరచ నాపరము లగుటచేత నందుఁ గవికల్పితకథలలోవలె సౌచితీనిర్వాహ మంతగా నుండదు. మటియు నాపురాణకర్తలేవో పరమార్ధముల నిరూపించుటే ముఖ్యముగాఁ గొన్నవా రగుటచేతను, నౌచితి నంతగాఁ బాటింపకయుఁ బోయిరి. యుద్ధరంగమున గీతోపదేశము, నారణ్య