పుట:Telugu merugulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

55


ద్వితీయాంతములుగా నున్నవి. నాల్గవచరణమునఁగూడ నట్లే కదా యుండవలెను. ఈ తీరునఁజూడఁగా - "ప్రబలబిడాలంబు భారతీశారిక నడఁప సత్వరమున నరుగుమాడ్కి" అని యుండుట బాగు, ఈ 'భారతీ శారిక' పదము 'భారతీదేవి ముంజేతి పలుకుఁజిలుక' వంటిది.

కీచకుఁడు ద్రౌపదిఁగూర్చి చేయు నసందర్భాలాపములలో నీక్రిందిది యొకటి.

"చిత్తము మెచ్చి సౌవలనఁ జిక్కగ వెండియు నాలతాంగి య
చ్చోత్తినయట్లు నాకుఁ దన యుల్లము తెల్లము సేయకున్కిదా
సత్తణిఁ క్రొత్త కాన్పుగుట నడ్డము సొచ్చిన సిగ్గు పెంపు న
సుత్తలమందఁ జేయుటకునో తలపోసి యెఱుంగ నయ్యెడున్. "

ముద్రణములో నీపద్య మిట్లున్నది. తిక్కన పలుకుబడి గాని, యర్థపుసొంపుగానీ యిందుఁ బొందుపడకున్నది. ఇది యిట్లుండగాఁ దగు నని నాతలంపు:

“చిత్తము మెచ్చి నావలనఁ జిక్కఁగ వెండియు నాలతాంగి య
చ్చొత్తినయట్లు నాకుఁ దన యుల్లము తెల్లముసేయకున్కి దా
నత్తణి క్రొత్తకానగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపా? న
న్నుత్తల మందఁ జేయుటగునో? తలపోసి యెఱుంగ నయ్యెదన్. "

రాయబార మరుగునప్పుడు కృష్ణునితో ద్రౌపది తన భంగపాటును జెప్పు పలుకులలో-


"అంతలుసేసి పోసడిచి యక్కట సంజయచేతఁ జెప్పి, పు
త్తెంతురె? యిట్టి యూఱట మదింబ్రియమందే యుధిష్ఠిరుండు దా
సంతన యూళు లేవురకు నైదు సుయోధనుఁ టిచ్చునొక్కొ? ఈ
కంత కృపావిహీనమతి నాతఁడు నేచునె యన్నదమ్ములన్."<poem>