పుట:Telugu merugulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

తెలుఁగుమెఱుంగులు


నింకొక పద్యమున, “కేలిమై నొక్కటలీలఁ గ్రేళ్లుఱికెడు వాలుగుసోగల నేలుదెంచి" అని యున్నది. 'ఏలుదెంచి', యనుట తిక్కన ప్రయోగముకాదు. ఏఁగుదెంచు, జనుదెంచు, పుత్తెంచు, తోతెంచు ఇత్యాదిగా గత్యర్థ సంబంధములగు ధాతువులమీఁదనే 'తెంచు' ధాతు వనుప్రయుక్త మగుట భాషలోఁ గొనవచ్చును. తక్కిన మూఁడు చరణములలోను తెగడి, తూలంద్రోలి, ఉక్కడంచి యున్నవి గనుక యిక్కడఁ గూడఁ దదను గుణముగా 'నేలిదించు' - అవహేళనము చేసి యని దుర్ధము. ఇంకొకటి


"సమదవారణము జంగమలత వెనుకొని
సరభసంబునం జనువిధమునం
గ్రూరదానవుఁడు భూచారి నిర్ణరకాంతం
బొదువ రయమ్మునఁ బోవుభంగి
గృధ్రము సుకుమార నాగాంగనం
బటుగతి నొడియంగఁ బాఱుకరణీయ
బ్రబలబిడాలంటు బాలశారికమీంద
నడరి సత్వరమున నరుగుమాడ్కి
సింహబలుఁ డత్యుదగ్రతఁ జిగురుబోండి
పజ్ఞుఁ గడువడి దగిలి కోపంబు గదుర
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తి
గోంకు కొసరించుకయు లేక కూలంచె".


ఈ పద్యమున ద్రౌపది కుపమానములుగా మూఁడు చరణములలో జంగమలత, భూచారి నిర్జరకాంత, సుకుమార సాగాంగన యనునవి భూలోకదుర్లభము లున్నవి. నాల్గవ చరణమునఁగూడ నట్లేకదా యుండ వలెను. మఱియు మూఁడు చరణములలోను ద్రౌపద్యుపమానపదములు