పుట:Telugu merugulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

53


గడుసరికూర్పు నేర్పులును సెన్నో యప్రౌఢులైన లేఖకపాఠక ముద్రాషకుల మూలమునఁ దార్మారై కానవచ్చినవి. దేసి తెలుఁగు మఱుఁగులెటింగిన ప్రౌఢాంధ్రపండితులు గాని గుర్తింపరాని వగుటచే ననేకపాఠములు తిక్కన రచనలో నట్లు తార్మారైనవి.


"తన్వంగి మవ్వంపుఁ దసులత నెసగెడు
నునుగాంతి వెల్లువ మునుఁగండాలం
గీసలయహస్తకెంగేల నేపారు క్రా
మ్మించను లేయెండ మిగులఁ బర్వం
గమలాస్య ముదుమొగంబు లేమెఱుఁగుల
మొత్తంబుపర్ చుట్టు ముట్టి కొనఁగ
ధవళాక్షితాంగలి తలుచుకెప్పుల చెన్ను
కప్పునుచీకటి గవియుదేర
బెగ్గలం అంతకంతకు సగ్గలించి,
యొదవి చెమ్మట, చిత్తంబు సెదరి, యెందు
మెలగఁ దలఁపేది, యా సింహబలుఁ డనంగు
పట్టి యాడెడు జంత్రంబుపగిది నుండే",


ఈ పద్యము నెత్తుగీతియందుఁగల యసమాపకక్రియల నాల్గింటిని సీసపునాలుగు పాదములకు యథాసంఖ్యముగాఁ గూర్చుకొని యర్థమెరుఁగఁ దగును. కాంతివెల్లువ కీచకుఁడు మునుఁగునట్లు ప్రవహింపఁగా వానికి బెగ్గల మంతకంతకు నగ్గలమైనది. లేమెఱుఁగుల మొత్తమను సైన్యము చుట్టు ముట్టుకొనఁగా జిత్తము సెదరినది. కసుఱైప్పల కప్పనుచీఁకటి క్రమ్ముకొనగా నెందును మెలఁగలేక పోయినాఁడు. ఇందుఎత్తుగీతి పై యర్థమున కనుగుణముగా ముద్రణములందుఁ గానరాదు. మఱియు