పుట:Telugu merugulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

తెలుఁగుమెఱుంగులు


తిక్కన చేసిపలుకుల మెలపులతోఁ గవితామర్మములతో సంస్కృతమున వ్యాసుఁడు చొప్పించినట్లు పెక్కుచోట్ల గ్రంథ గ్రంథులను చేర్చినాఁడు.


"గురునిమాట సరకుగొనమి దుశ్శీలత
పిట్టఁ బుడుక గోరుఁ బిసుకఁ ద్రుంప
గరవ మరుగు టుదయకాలాస్తమయ సమ
యముల ఖానుఁ జూచు టాయు వడఁచు."


ఈ పద్యమునఁ గవితా మర్మ మున్నది. క్రొత్తవా రీపద్యము నర్థమును గుర్తింపఁజాలరు. వృద్ధవిద్వాంసుల మూలముననో, సంస్కృత మూలము మూలముననో గుర్తింపవలసినది దీనియర్థము. 'అష్టమర్టీ తృణచ్ఛేదీ నఖఖాదీ చ యోనరః' అను మూలమున కిది తెనుఁగు. పిట్ట, పుడుక, గోరు అనఁగా లోష్టము, తృణము, నఖము, అనువానిని పిసుకుటకును, త్రుంపుటకును, కఱచుటకును, అలవాటుపడుట ఆయువును హరించు నని యర్థము. తిక్కన దీనిని 'బెడ్డ చిదుప, పుడక విరువ, గోరు గరవ, మరుగుటుదయ' అని సులువుగాఁ గూర్పవచ్చును. అయినను నిందు యథాసంఖ్యాలంకారము చేర్చి పిట్టపుడుక గోరు అనుచోఁ బెట్టను బట్టుకోనఁగోరునట్టి యని యనన్వితార్థాభాసచిత్రమును గల్పించి పాఠకులను లోఁతుయోచనకుఁ బాల్పఱచినాఁడు.మటియు,

"అనిన నలు గాలివాన గోవును నశేష
శబ్దముల మంత్రమును లోహజాతీఁ గాంచ
నమును మనుజుల విప్రుండు సమధికత్వ
భాజనము లండ్రు వేదప్రపంచవిదులు. "