పుట:Telugu merugulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

49


పతివల్ని' ననుచోటను, 'అడుగఁదగునె' అనుచోటను అర్థవిశేషములు న్నవి. (అయిన యింటివారు ఇత్యాదులు చూచునది) అయిన = చెల్లి వచ్చిన, ప్రఖ్యాతిగాంచిన - భర్తలుగలదాన నని (అటువంటివారి విషయమై అడిగేదేమిటి " ఇత్యాదులు చూచునది. ), ప్రశ్నస్మరణమే చేయరానిదాన నని ఆర్ధవిశేషములు. ముద్రణములం దీపద్య మిట్లున్నదిగానీ యిందు తిక్కనకూరు కొంత మార్పుచెంది ఉండు ననుకొనుచున్నాను. 'అట్లు గాకయు' అనుచోట అటు తర్వాతి సముచ్చయపు టరసున్న- 'కాకయు' అనుచోటి 'యు' స్వారస్యమును సంపాదింపఁగల్గియే యున్నది. ఇంక 'యు' వ్యర్ధము. తిక్కన "అట్లుఁగాకయో హీన" అని రచన చేసి యుండును. తొలి యర్ధమున “అట్లుఁగాక - అయో-హీనవంశాభిజాతను అనియు, రెండవ యుర్ధమున అట్లుఁగాక - ఓహీన అనియు ఛేదము ససిపడును.


“అని విడఁగఁబల్కిన న
మ్మనుజాధముఁ డంతఁ బోక మదనోన్మాదం
బునఁ దన్ను నెదిరి నెఱుఁగక
వనితకు నిట్లనియెఁ గారవంపుఁ బలుకులన్",


తర్వాతి యీ పద్యములోఁ దన్ను నెదెరిని - పాదప్రహారము చేయుదానిని ద్రౌపదిని అనియు కవి పొసగించినాఁడు. ఇట్లు తిక్కన భారతపురాణరచనమున ప్రబంధపక్కితో వక్రోక్తి చమత్కృతులు. శ్లేషభంగులు, అనన్వయాభాసములు, గడుసు పొసగింపు కూర్పుతీర్పులు లెక్కకు మిక్కిలి యయియున్నవి. అత్యంత శ్రద్ధతో పరిశీలింపఁగా ఒక్క విరాటపర్వ ద్వితీయాశ్వాసముననే ఎన్నో శబ్దార్ధచమత్కారములు ప్రస్తుతపు ముద్రణ ములలో, ప్రాఁతలలో ఆపరిశీలితములుగా చెడిపోయినవి, చక్కఁబఱుప వలసినవి, గాన వచ్చినవి.