పుట:Telugu merugulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

తెలుఁగుమెఱుంగులు


హీనవంశసంజాతను, మగనాలను, ఉన్నత వంశము గర్హించు ననియు, ఆఁడుతోడు చెడనాడు ననియు, అక్కకుకూడ నీగతి పట్టవచ్చు ననియు, నీ విషయమున నీవు వెఱవవలెను. నావిషయమునఁగూడ, నీచజాతి దనీ, మగఁ డెఱిఁగిన దండించు నని నీవు వెఱవవలెను", అని సామాన్య ముగా తోఁచు బాహ్యార్ధము. ఇక్కడ లోఁతయిన యర్థాంతరము నున్నది.


“సజ్జనుఁడు, ఆఁడుతోడుగలవాఁడు ఇట్టి మాటలాడఁడు. ఇట్టి చెట్టలాడుచున్నావు గాక! నీవట్లుగాక దుర్జనుఁడవు. ఆఁడుతోడులేని వాఁడవు నయితివి! 'నాకు సజ్జనతాపేక్షలేదు, ఆఁడుతోడుకలిమి నేను పాటించువాఁడను గాను!” అందువేమో! (సుధేష్ణ వీనికి తగిన యాఁడుతోడే, తన పాడునడత కామెనుగూడ తోడుపఱచుకొన్నాఁడుగదా!) అయితే నీవట్లగుదువుగాక! హీన! ఓరి నీచుఁడా! వంశాభిజాతను! పవిత్ర క్షతీయ వంశజాతను! యజ్ఞాగ్ని సంభూతను! అయిన పతివల్నిని, అఖండ పరాక్రములయిన భర్తలుగల దానను! నన్ను నటరా నీవు కోరునది! నా వంశపు యోగ్యతను, భర్తల యోగ్యతను దెలియక వదరుచున్నావు. ఈ రెండు యోగ్యతలు నిన్ను నాశపఱుపఁగలవురా" అని యర్థాంతరము!

పాఠకులు పై రెండర్థములలో కీచక సైరంద్రీపాత్రములను జూచి సాధారణముగా తొలి సువ్యక్తార్తమును సైరంద్రిలో దాగియున్న ద్రౌపదీపాత్రను గుర్తించి, లోఁతుగా రెండవ యంతరార్థమును గ్రహింపఁ గల్గుదురు. లోఁతుగా యోచింపఁజాలనివారు తొలి యర్థమునే గ్రహింతురు. కీచకుఁడు మదనపిశాచగ్రస్తుఁడై యాత్రపాటుతో నున్నాఁడు గాన తొలియర్ధన అనే గ్రహింపగల్లెను. ద్రౌపదీ తాను భావించునది రెండవ గంభీరార్థమునే! తిక్కన యీ రెండర్దముల ననుగత పఱిచి శ్లేషధ్వన్యర్థ చమత్కారముతో పద్యమును గూర్చినాఁడు. పయిపద్యమున 'అయిన