పుట:Telugu merugulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

47


నొడుదుడుకు నేలలనుండి సుడులు దిరుగుచు మడుగులు మాటులుగలిగి లోతు తెలియనీయని కలకనీటి పోటుతో ప్రతిపదమును జాగ్రత్త వహించినఁ గానీ దాఁట వీలుగొల్పని వక్రగతులతో సాగు గంభీరనదీ ప్రవాహమువలె తిక్కనరచన సుప్రసన్నమై వెనుకకు ముందుకుఁ దిరుగు వాక్యోపవాక్యములయు, కారకాన్వయముయు కౌటిల్యముతో ఇంక నిందేమి విశేషము గలదో యని సహృదయులు ప్రతిపదము సందేహముతో ఆచియాచి చూచిచూచి మఱీ చదువవలసిన తీరుస చిక్కులు గొలుచు జిగిబిగితో నుండును, ఇది పురాణఫక్కికాదు. మటి దివ్యకావ్యఫక్కి, కవితామర్శ మిందెక్కువ. వక్రోక్తులు, ఆర్థాలంకారములు, వ్యంగ్యము నిం దధికముగా నుండును. ఇందుకు లక్ష్యము నొక్క గీతపద్యము సుదాహరించుచున్నాను. విరాటపర్వ ద్వితీయాశ్వాసమున కీచకుఁడు ద్రౌపదిపై తమక మాపుకొనలేక నీచవాంఛను వావిడిచి వెల్లడించినాఁడు. అప్పు “డబ్బోటి కలుషించియు దుర్వారంబైన పరిభవవికారంబు దోఁపనీయక వెరవుతోడన తప్పించు కొనవలయు నని" యిట్లన్నది.


“చనునె యిమ్మాటలాడ సజ్జనుల కాఁడుఁ
బుట్టువులతోడ నీవును బుట్టినాఁడ
వట్లుఁ గాకయు హీనవంశాభిజాత
నైన పతివల్ని నగు నన్ను నడుగఁదగునె?"


“అన్నా ! కీచకా ! సత్పురుషులు పరస్త్రీల నిట్లు కోరవచ్చునా? అంతేకాక ఆఁడుతోడుగలవాఁడు మఱీజాగ్రత్తగా నుండవలెనుగదా! నీవు సజ్జనుఁడవు. సుధేష్ణవంటి యాఁడుతోడుగలవాఁడవు, నీవిట్టి చెట్టపలుకులు పలుకరాదే ! ఇట్లు కోరఁగూడమికి నీ యోగ్యతాంశము లివి రెండే కాదు. మణి నా యయోగ్యతాంశములును రెండున్నవి. నేను