పుట:Telugu merugulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

తెలుఁగుమెఱుంగులు


నన్నయరచన ధర్మోదాత్తము. కర్ణాటకములోని జైనభారత పుటలజడి తెలిసినవాఁడు గనుక తెలుఁగు నాఁటిలో వ్యాసభారత ధర్మవిశేషములను వెలయుంపఁ గోరి అతఁడు కావ్యరచనకు కడఁగినాఁడు. భారతము నీతిశాస్త్ర గ్రంథ మని ప్రఖ్యాతి గన్నది. నన్నయ భారత భాగములోని నీతిపద్యములు రీతిహృద్యములు; సౌలభ్య సుందరములు. తెలుఁగు కవు లందిరిలో వచన రచన నన్నయ చేసినట్లు మరియే కవియు చేయలేకపోయినాఁడు. ఆ వచనరచనలో పలుకుబడి బహుమనోహరము. వాక్యములు సులభమయినవి. అనుప్రాసపు రెట్టింపు లం దుండవు. వచన ఖండముల పరిమాణము మితమై పులకండములఁ బోలియుండును. ప్రపంచభాషలలో ఆంధ్రభాషకు, ప్రపంచకవితలలో ఆంధ్రకవితకు ఏదేని అర్హస్థానము అబ్బందగిన యోగ్యత కలదేని ఆ యోగ్యతా విస్తర భార మెల్ల నన్నయ భారత భాగమే మోయవలసిన దగును. ఆ పుణ్యమూర్తికి వందనము. ఆయన కాశ్రయమిచ్చి పోషించిన చాళుక్య రాజరాజు కీర్తిపతాక చిరస్థాయి!


“మదమాతంగతురంగముఖ్యపదసంపన్నుండు సన్నయ్య తొ
మ్మిదినూర్ణేండ్లకు ముందుజూ పె కవితోన్మేషంబు సర్వాంధ్రసం
పద పెంపొంద చళుక్యవల్లభుఁడు సామ్రాజ్యాభిషిక్తుండుగా
నది నాబోటికి నేఁటికబ్బునటి వ్యాఖ్యానింప నాఖ్యానమున్"


నన్నయ్యతర్వాత భారతరచనమును బూరించిన తిక్కనసోమయాజి నన్నయరచనమును దిన్నగా నెఱిఁగినవాఁడే అయినను నన్నయ్య శళ్యూని భాగ్యమున ప్రసన్నతను పాటింపక, సంస్కృత భారతపు వ్యాసఘట్టములను బోలిన గ్రంథగ్రంథుల నధికముగా గూర్చి, కవితా మర్మముల నధికముగా జొప్పించి పురాణరచనాసౌలభ్యమును గోల్పడినాడు. వర్షా సమయమున