పుట:Telugu merugulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

45


ఈ క్రింది పద్యపు కడపటి చరణములో విశేషణములు విశేష్యమునకు తర్వాత నుండి ఒకదానికంటె నొకటిగా గుణోత్తరములై అవిమృష్టవిధే యాంశమనియు, పతత్రకర్ష మనియు నెన్నికగన్న కావ్యదోషములకు వ్యతిరేకముగా కావ్యగుణోదాహరణతను కల్పించుచున్నవి.


“సుతజననోత్సవంబున విశుద్ధయశుండు యుధిష్ఠిరుండు సం
భృతహృదయప్రమోదుఁడయి పెంపున నిచ్చె సువర్ణభూషణ
ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణ ముఖ్యలకున్ నిరంతర
వ్రతులకు వేదవేదులకు వారిజ సంభపునట్టివారికిన్.


ఈ విధముగా నన్నయరచనలో పలుపోకల గుణ విశేషములను పరిగణింపవచ్చును. ఆయనరచన రసధారల యూటపట్టు, ఆంధ్రకవుల కాతఁడు "మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి:!"


నన్నిచోడాదికవీశ్వరు లాయనరచనల నెన్నిటినో పుడికిపుచ్చు కోన్నారు. నన్నయ నన్నిచోడుల పద్యము లివి రెండు చదువుఁడు.


"తడంబడఁబడియెడు రవమును
బడి కాలెడు రవము గాలిపలుదేఱుగుల ప్ర
స్పెడురవమును దిగ్వలయము
గడుకొని మ్రోయించె నురగకాయోళితమై."

"గిరిసుతమైకామాగ్నియు;
హరుమైరోషాగ్నియుం దదంగజుమై ను
దుర్ఘకాలాగ్నియు రతీమై
నురుశోకాగ్నియును దగిలి యొక్కట నెగసెస్"


తిక్కన, శ్రీనాథుఁడు, పోతన, పెద్దన మొదలగు మహాకవులు నన్నయరచనములలోని పల్కు పొలుపులను పెక్కింటిని బరిగ్రహించినారు.