పుట:Telugu merugulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.తెలుఁగుమెఱుంగులు

42


“ఏను కచుం డనువాఁడ మహానియమసమన్వితుఁడ బృహస్పతి సుతుఁడన్" అని చెప్పుకొని శుక్రుని శుశ్రూషించిన కచుని శుక్రపుత్రియైన దేవయాని ప్రేమించి యిట్లు కోరినది.


“నీవును బ్రహ్మచారివీ వినీతుఁడ వేనును గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయుడి పన్నుగ నన్ను బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ జేయుము నాకుఁ బ్రియంబు నావుడున్",


అని కోరి కచునిచే నిరాకృతయైన దేవయాని దైవకృతముగాఁ బిదప యయాతి మహారాజు పాణిగ్రహణము కావింపఁగా నన్నతీరు మౌగ్ధ్యమాధుర్యభాసురమేకాని నవ్య కావ్యాచితరీతిని రోత గొల్పునదే. ఇట్టి సందర్భముననే, అనఁగా మాయావటుఁడు పార్వతిని భార్యవు గమ్మనీ కోరు సందర్భమున శృంగారరసభావ శ్లేషచమత్కార గర్భితముగా


"కీయ చ్చిరం శ్రామ్యసి గౌరి, విద్యతే మమాపి పూర్వశ్రమసంచితం, తపః, తదర్ధభాగేన లభస్వ కాంక్షితం వరం తమిచ్ఛామి చ సాధు వేదితుమ్"


అని కాళిదాసు రచన కావించినాఁడు. శ్రీనాథుఁడు దానిని దెలిఁ గించుటలో కాళిదాసు మార్గమును పీడనాడి అలంకారశాస్త్ర సంప్రదాయ వాసనల నెఱుఁగనివారినిగానే పార్వతీవటులను భావించి నన్నయఛ్ఛాయనే అనుగమించినాఁడు.


 "ఏనును బ్రహ్మచారిఁ దరళేక్షణ నీవును గన్య వెంతకా
లానకు నీకుఁ బెండ్లియె ఫలంబగునేని విచారమేల స
మ్మానముతోడ నన్ను మునీమాన్యు వివాహముగమ్ము లెమ్ము కా
దేని తపంబులోని సగమిచ్చెద మాను తపోఽ భిమానమున్",