పుట:Telugu merugulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

41


ఇందు నాల్గవచరణమున 'కే' యని కేక, 'శవ నీవుంగడగుండు' అని నింద. ఇట్టిచోట్లనెల్లం బలుకుబడిలోనే యర్థ విశేషములు పదచ్ఛేదభేద ముచేఁగల్పించి గంభీర భావభేదములకు ఝడితిస్ఫూర్తి గూర్చుట నన్నయ నైపుణ్యము. కారకాన్వయ కౌటిల్యముతో నర్థవిశేషములను సాధించుట - నన్నయ తీరు కాదు.


భారతకథోపాఖ్యానాదులలోని పాత్రముల భావములు, సంభా షణములు చాల ప్రాతకాలపుని గావునఁ గొన్నిచోట్ల వ్యంగ్య వక్రోక్యాది కవితా కౌటిల్యములు లేనివిగా, నమాయికములుగా నున్నవి. అట్టివానిని తెలిఁగించుటలో నన్నయ తిక్కనలు విభిన్నరీతుల నాశ్రయించిరి. నన్నయ తన నాఁటికే వెల్లివిరిసియున్నవయినను కావ్యాలంకారశాస్త్ర సంప్రదాయముల గాపాడినాఁడు. తిక్కన యాయా పాత్రములఁ దననాఁటివానినిగాఁ గొన్నిచోట్లఁ గావ్వౌచితీ నిర్వహణార్థమై మార్చుకొని, తననాఁటి కావ్యాలంకార శాస్త్ర సంప్రదాయముల కనుగుణముగాఁగథానిర్వహణము కావించినాఁడు, నన్నయ రచన మూలానుసారియై, మౌధ్ధ్య మాధుర్యమనోజ్ఞమై, యార్షమై యున్న దనుట కొకటి రెం డుదాహరణములు.


నన్నయ శకుంతలోపాఖ్యానరచన కావ్యాలంకారౌచితీరీతినిఁ జూడఁగా గ్రామ్యతా దోషజుష్ట మనఁదగియుండును. వ్యాసుఁడే దాని నిట్లు రచియించినాఁడు. అమాయికములైన సత్యకాలపుమునిపల్లెలపిల్లల ముగ్ధ మధురసంభాషణములను మూలానుసారముగా తెలిఁగించుటే లగ్గని నన్నయ భావించి యట్లు రచించియుండును. తిక్కన యగుచో సాపట్టుల వ్యంగ్యవక్రోక్తి కల్పనాశిల్పముల నెట్టుకొల్పి నవ్యకాలికరీతిని కావ్యశయ్యతో కల్పించి యుండెడివాఁడేమో! నాటక రూపమున నా కథ నట్లే కాళిదాసు మార్చివేసినాఁడు కదా!