పుట:Telugu merugulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱంగులు

27


నేనిక శ్రుతి మించుచున్నది అనుకొని సంస్కృతాంధ్రరచనలలో ఆమెకుఁగల సాహిత్య చాతుర్యమునకు సంతోషము వెల్లడించి వచ్చినాను.

ఇంకొక ముచ్చట.

ఒక పూరియిల్లు. చిన్నది, తలుపు ఓరవాకిలిగా వేసి ఉన్నది. . లోపల ముసలమ్మ వడ్లు దంచుచున్నది. రోఁకటి పోటుతో పాటు.

“ఓరామ ఓరామ ఒయ్యారీరామ !
ఓరామ! ఓరామ!
ఓరామ! ఓరామ!"

అనుచు ఉచ్ఛ్వాసనిశ్వాసములతో రామనామస్మరణ జోడించు చున్నది - మధ్యాహ్నము ఒంటిగంట వేళ. ఇంట నామె ఒక్కరైయే. తాటాకు పుస్తకాలేవో ఉన్న వనఁగా చూడ వెళ్ళినాను. ఇంటిలోనికి అడుగు సాగక వాకిటనే ఉన్నాను. కొంతసేపటికి దంపుడు ముగియఁ గా చేటలో దంచిన బియ్యము చేర్చుకొని చెఱుగఁబోవుచు ఈ క్రిందిపద్యము చదివినది.

కలం దందురు దీనులయెడం
గలఁ డందురు పరమయోగిగణములపాలన్
కలఁ డందు రన్ని దెసలను
కలఁడు కలం డనెడువాఁడు కలడో లేడో |

నాలుగవ చరణము గద్దించుచు మఱి ముమ్మాఱులు చదివినది. ఇదే సందర్భమురా అనుకొని 'ఉన్నాఁ డమ్మా' అనుచు నేను లోపలికి వెళ్ళినాను. ఆమె ఆబియ్యముతో అటుతరువాత వంటచేసికొని భోజనము చేయఁబోవును. ఇట్లనుకొన్నాను. 'ఆహా! పోతరాజుగా రెంత పుణ్యాత్ములు. భాగవత మెందటినో పవిత్రాత్ములనుఁ జేయుచున్నదిగదా!" బ్రౌనుదొరగారి కెవఁడో దీనుఁడు ఈ క్రింది పద్యమును ఆర్జీగా