పుట:Telugu merugulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

తెలుఁగుమెఱుఁగులు


సీతాదేవిని రావణాసురుఁడు రామవేషము వేసికొని వచ్చి అమాంగల్యపటిచినట్లు ఏకవి అయినను కథ కట్టినచో విజ్ఞుల కందరికిని వెఱ్ఱులు, వేకులు ఎత్తవండీ! అంత రోతగానే కాదండీ ఉన్నది యిక్కడి సందర్భమూను? ప్రవరునిమీఁదనే ప్రాణము లర్పించి ఉన్న వరూథినిని అంతకుముం దామెను ప్రేమించి ఆమెచే ఛీ ఛీ అని చీవాట్లు తిన్నదొంగ ప్రవరవేషముతో వచ్చి చేటుకూర్చుట చండాలముగా లేదండీ! వరూధిని వెలయా లందురు! ఆమే ప్రవరుని ఏమి వెలకయి ప్రేమించినది! వేషధారి ప్రవరుఁడు ఏమి వెల యిచ్చి ఆమెను కొనుక్కొన్నాఁడు! ఆంధ్రకవితా పితామహుని అనుగ్రహము అట్లున్నదే!" అన్నది.

నేను “చాల చుఱుకుగా ఉన్నదే సల్లాపము” అనుకొనుచు, “సంస్కృతము బాగుగా చదువుకొన్న ట్లున్నావమ్మా" అన్నాను.

“మా నాయనగారు విద్వాంసులు. వారు నేర్పఁగా కావ్య నాటకములు కొన్ని చదువుకొన్నానండీ!" అనుచు నామే కాళిదాసు కవీంద్రునిమీఁదకూడ కంకరతాళ్లు విసరసాగినది. “చూడండి! శాకుంతలములో దుష్యంతునికి రంగప్రవేశము ఎంత సంతాపజనకముగా ఉన్నదో”.

"తా నేదో వేఁటకు వచ్చినాఁడు. ఆశ్రమమున కణ్వమహర్షి లేఁడు. ముగ్ధలు ఋషికన్యలు చెట్లకు నీళ్లుపోయుచున్నారు. అక్రమముగా ఆశ్రమప్రాంతమునకు వెళ్లి, ధీరోదాత్తుఁడుగా పొగడ్తగాంచవలసిన మహారాజు దొంగచాటుగా నక్కిఉండి ఆకన్యలను తొంగిచూచుట, 'సతాంహి సందేహపదేషు' అని తనతప్పును ఒప్పునుగా తానే పొగడుకొనుట మర్యాదగా ఉన్నదండీ! శకుంతలముఖాన తుమ్మెద వ్రాలఁగా ఆపన్నురాలిని రక్షించి రాజధర్మము నెఱపఁబోవుచున్నట్టు దర్పాలు పలుకుకొనుచు వంకరతలఁపుతో రంగప్రవేశము చేయుట బాగుగా ఉన్నదండీ?” అన్నది. సీతాదేవిని రావణాసురుఁడు రామవేషము వేసికొని వచ్చి అమాంగల్యపటిచినట్లు ఏకవి అయినను కథ కట్టినచో విజ్ఞుల కందరికిని వెఱ్ఱులు, వేకులు ఎత్తవండీ! అంత రోతగానే కాదండీ ఉన్నది యిక్కడి సందర్భమూను? ప్రవరునిమీఁదనే ప్రాణము లర్పించి ఉన్న వరూథినిని అంతకుముం దామెను ప్రేమించి ఆమెచే ఛీ ఛీ అని చీవాట్లు తిన్నదొంగ ప్రవరవేషముతో వచ్చి చేటుకూర్చుట చండాలముగా లేదండీ! వరూధిని వెలయా లందురు! ఆమే ప్రవరుని ఏమి వెలకయి ప్రేమించినది! వేషధారి ప్రవరుఁడు ఏమి వెల యిచ్చి ఆమెను కొనుక్కొన్నాఁడు! ఆంధ్రకవితా పితామహుని అనుగ్రహము అట్లున్నదే!" అన్నది. నేను “చాల చుఱుకుగా ఉన్నదే సల్లాపము” అనుకొనుచు, “సంస్కృతము బాగుగా చదువుకొన్న ట్లున్నావమ్మా" అన్నాను. “మా నాయనగారు విద్వాంసులు. వారు నేర్పఁగా కావ్య నాటకములు కొన్ని చదువుకొన్నానండీ!" అనుచు నామే కాళిదాసు కవీంద్రునిమీఁదకూడ కంకరతాళ్లు విసరసాగినది. “చూడండి! శాకుంతలములో దుష్యంతునికి రంగప్రవేశము ఎంత సంతాపజనకముగా ఉన్నదో”. "తా నేదో వేఁటకు వచ్చినాఁడు. ఆశ్రమమున కణ్వమహర్షి లేఁడు. ముగ్ధలు ఋషికన్యలు చెట్లకు నీళ్లుపోయుచున్నారు. అక్రమముగా ఆశ్రమప్రాంతమునకు వెళ్లి, ధీరోదాత్తుఁడుగా పొగడ్తగాంచవలసిన మహారాజు దొంగచాటుగా నక్కిఉండి ఆకన్యలను తొంగిచూచుట, 'సతాంహి సందేహపదేషు' అని తనతప్పును ఒప్పునుగా తానే పొగడుకొనుట మర్యాదగా ఉన్నదండీ! శకుంతలముఖాన తుమ్మెద వ్రాలఁగా ఆపన్నురాలిని రక్షించి రాజధర్మము నెఱపఁబోవుచున్నట్టు దర్పాలు పలుకుకొనుచు వంకరతలఁపుతో రంగప్రవేశము చేయుట బాగుగా ఉన్నదండీ?” అన్నది.