పుట:Telugu merugulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

తెలుగుమెఱుంగులు

\

బడసి వెలసిన వన్న వేఱొక గౌరవవిశేషముగలదు. ఆంధ్రుల కాచారవ్యవహార స్వరూప స్వభావాహార దేశలక్షణాది బహుకారణములచే గల్గిన భిన్నభిన్న లక్షణముల కనుగుణముగా నేర్పడిన శబ్దరూపములను మీఁదఁ జూపితిని. 'నెయ్ 'శబ్దము తెలుఁగులో నిన్ని హృద్యరూపముల నందినది గాని యిది 'నూవు' శబ్దముతో సమాన మందినప్పుడు కొన్ని ప్రాకృత భాషా సంబంధ సంభవములైన వికారములకుఁగూడఁ బాల్పడెను. 'నూవు' శబ్దము తొలుత 'నూవ్' అను రూపము గలది. తెలుఁగుహలంతత్వము నేవగించుకొనును గాన నది 'సూవు' అను రూపమును బడసెను. ఆ హల్మాత్రము కరఁగి పోపుటచే 'సూ' అను రూపమేర్పడెను. కరఁగిపోయిన యాహల్మాత్రమయిన 'వ్' అచ్చుపరమయి నప్పుడు మరలఁ గానవచ్చును. 'నూ + నెయ్' పదములు రెండును సమసింపఁగా, 'నెయ్' పద మెన్ని రూపములతో నున్నదో, అన్ని రూపములతోను ఆ సమాస ముండుట న్యాయ్యము. అనఁగా 'నూనెయి', 'నూనెయ్యి', 'సూనే', 'నూనేయి', 'నూనేయు' 'నూనై' అను రూపములుగూడ నుండవలెననుట. కానీ యట్టిరూపములు తెలుఁ గున పుట్టలేదు. దానికిఁ గారణ మే మనఁగా, 'నూనె' యనుసమాస పదము 'నెయ్' పదము మీఁదఁ బేర్కొన్న పరిణామముల నెల్లఁబడయుటకు బూర్వమే పుట్టి రూఢమైనది. అప్పుడు 'నూ + నెయ్' అని యుండి తెలుఁగునకుఁ బ్రియముకాని కడపటి హల్మాత్రము లోపింపగా సమాసదశలో నాపదము గురు లఘుఘటితమగుటచే 'సెయ్' 'నే' రూపమును బడయ నక్కలు లేకపోఁగా 'నూనె' అయ్యెను. కరఁగిపోయిన కడపటి హల్మాత్రవు 'య్' అచ్చుపర మయినపడు మరలఁగానవచ్చును గాన 'నూనె + అది' కలసినపుడు 'నూనెయది' అయ్యెను. ఇట్టి యకారమునే తెలుఁగు వైయాకరణులు 'యడాగమ' మని పేర్కొనిరి. ఇట్లు యడాగమ